ఎరువులు, పెట్రోలియం, ఆహార రాయితీలు తగ్గింపు

ఎరువులు, పెట్రోలియం, ఆహార రాయితీలు తగ్గింపు
  • 2021-22 కంటే 39 శాతం తక్కువ కేటాయింపు
  • రైతులు, పేదలపై పడనున్న ప్రభావం

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్​లో ఆహారం, ఎరువులు, పెట్రోలియం ఉత్పత్తులపై సబ్సిడీలకు భారీగా కోత పెట్టింది. 2021–22 ఆర్థిక సంవత్సరం సబ్సిడీలకు ఖర్చు చేసిన మొత్తం కంటే 39 శాతం తక్కువగా కేటాయింపులు జరిపారు. దీంతో 2022–23లో ఈ మూడింటిపై ప్రభుత్వం ఇచ్చే రాయితీల మొత్తం రూ. 4,33,108 కోట్లకు పరిమితమైంది. ఈ ప్రభావంతో పంటల పెట్టుబడులు, సాగు ఖర్చులు పెరిగి రైతులపై భారం పడే చాన్స్ ఉంది. అలాగే గ్రామీణ, పట్టణ నిరుపేదలపై ఆహార సబ్సిడీలో కోత ప్రభావం ఉంటుందని ఎక్స్ పర్ట్స్​ అంటున్నారు. 2022–23 బడ్జెట్ కేటాయింపుల్లో రివైజ్డ్ ఎస్టిమేషన్స్ వల్ల మరింత కోత పడి సబ్సిడీలకు చేసే ఖర్చు రూ.3,17,866 కోట్లకు మాత్రమే పరిమితయ్యే చాన్స్ ఉన్నట్లు బడ్జెట్​లెక్కలు చెప్తున్నాయి. 2021–22లో సబ్సిడీల కోసం రూ.7,7,707కోట్లు ఖర్చు చేశారు. ఈ సారి రూ.4,33,108 కోట్లు కేటాయించగా.. అది కూడా మరింత తగ్గి రూ.3,17,866 కోట్లకు  పరిమితం కావొచ్చని సూచించడం గమనార్హం. 
సాగు ఖర్చులపై ప్రభావం!
తాజా బడ్జెట్​లో ఎరువుల సబ్సిడీ కోసం రూ.1,05,222 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇది 2021–22లో ఎరువుల సబ్సిడీకి చేసిన ఖర్చు రూ.1,40,122 కోట్ల కంటే దాదాపు 25శాతం తక్కువ. ఈ లెక్కన వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎరువుల సబ్సిడీకి రూ. 35,1 00 కోట్ల కోత పడింది. పెట్రోలియం సబ్సిడీ కోసం ఈ బడ్జెట్​లో రూ.5,813 కోట్లు కేటాయించారు. ఇది 2021–22లో పెట్రోలియం సబ్సిడీకి ఖర్చు చేసిన రూ.6,517 కంటే 11 శాతం తక్కువ. పెట్రోలియం, ఎరువులపై రాయితీ తగ్గింపు వల్ల సాగు ఖర్చులు పెరిగి రైతులుకు భారంగా మారే చాన్స్ ఉంది. అలాగే ఆహార సబ్సిడీకి రూ.2,6,813 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఖర్చు చేస్తున్న రూ.2,86,469 కోట్ల రూపాయల కంటే 28 శాతం తక్కువ.
ఉపాధి హామీకి రూ.73 వేల కోట్లు
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవనోపాధి పెంచడానికి అమలు చేస్తున్న ‘ఉపాధి హామీ’ స్కీంకు 2022–23 బడ్జెట్​లో కేంద్ర ప్రభుత్వం రూ.73వేల కోట్లను కేటాయించింది. గత ఆర్థిక సంవత్సరం ఈ పథకం రూ.98వేల కోట్లు ఖర్చు చేశారు. నిరుటితో పోల్చితే ఈ బడ్జెట్​లో దాదాపు 25.5 శాతం ఫండ్స్ తగ్గించారు.
మైనారిటీ ఎఫైర్స్ మినిస్ట్రీకి రూ.5,020 కోట్లు
తాజా బడ్జెట్​లో మైనారిటీ ఎఫైర్స్ మినిస్ట్రీకి కేంద్రం రూ.5,020 కోట్లు కేటాయించింది. ఇది గత ఆర్థిక సంవత్సరం ఖర్చు చేసిన దాని కంటే రూ.674 కోట్లు ఎక్కువ. గత బడ్జెట్​లో రూ.4,810 కోట్లు ఇవ్వగా సవరించిన అంచనాల ప్రకారం ఆ ఆర్థిక సంవత్సరంలో రూ.4,346 కోట్లు ఖర్చు చేశారు. 2022-23కి కేటాయించిన మొత్తంలో రూ. రూ.1,425 కోట్లను ప్రీ మెట్రిక్ స్కాలర్​షిప్​లు, రూ.515 కోట్లను పోస్ట్​ మెట్రిక్ స్కాలర్​షిప్స్ కోసం ఖర్చు చేయనున్నారు. స్కిల్​డెవలప్​మెంట్, జీవనోపాధి పెంపు కోసం మరో రూ.491 కోట్లు ఖర్చు చేయనున్నారు. కరోనా ప్యాండమిక్​ టైమ్​లో ఇండియా స్వయం సమృద్ధి సాధించేందుకు ఈ బడ్జెట్​ ఎంతగానో ఉపయోగపడుతుందని మైనారిటీ ఎఫైర్స్ మినిస్టర్ ముఖ్తార్​అబ్బాస్ నక్వీ అన్నారు.