ఎకనామిక్ సర్వే బడ్జెట్​కు దిక్సూచి

ఎకనామిక్ సర్వే బడ్జెట్​కు దిక్సూచి

బిజినెస్ ​డెస్క్​, వెలుగు : ప్రతి ఏటా ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రవేశపెడతారు. ఈ ఏడాది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ ఆరోసారి బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రవేశపెట్టనున్నారు.  ఆర్థిక మంత్రి పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కేంద్ర బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చదవడానికి ముందు, ప్రభుత్వం మరొక కీలకమైన వార్షిక పత్రాన్ని అందజేస్తుంది. అదే-- ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా. ఈ డాక్యుమెంట్ ఒక యాన్యువల్​ రిపోర్ట్​. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఆర్థిక వ్యవహారాల విభాగం దీనిని తయారు చేస్తుంది. ఇది ముగియబోతున్న ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ  పూర్తి వివరాలను అందిస్తుంది. ఎకనామిక్ సర్వేను మొదటిసారిగా 1950–-51లో సమర్పించారు.  ఆ సమయంలో, ఇది ప్రధాన కేంద్ర బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగం.  1964 తర్వాత, ప్రధాన బడ్జెట్ సమర్పణకు ఒక రోజు ముందు ఆర్థిక సర్వేను విడిగా తయారు చేసి ప్రవేశపెడుతున్నారు. 

ఆర్థిక సర్వే అంటే ఏమిటి?

ఆర్థిక సర్వే ప్రాథమికంగా గత 12 నెలలుగా వ్యవసాయం, సేవలు, పరిశ్రమలు, పబ్లిక్ ఫైనాన్స్,  మౌలిక సదుపాయాలు వంటి వివిధ రంగాలలో జరిగిన పరిణామాలను నిశితంగా పరిశీలిస్తుంది.  ఎగుమతులు, దిగుమతులు, విదేశీ మారక నిల్వలు  ద్రవ్య సరఫరా గురించి కూడా సమగ్రంగా వివరిస్తుంది.  ప్రభుత్వ విధాన కార్యక్రమాలను,  ప్రధాన అభివృద్ధి కార్యక్రమాల పనితీరును విశదీకరిస్తుంది. ఆర్థిక వ్యవస్థ వృద్ధికి గల అవకాశాలను చూపుతుంది.  జీడీపీ వృద్ధి, ద్రవ్యోల్బణం రేటు  అంచనా, ఫారెక్స్ నిల్వలు  వాణిజ్య లోటుల గురించి కూడా వివరిస్తుంది.  సమస్యలను ఎదుర్కోవటానికి తీసుకోవాల్సిన చర్యలతో పాటు ముందున్న కీలక సవాళ్లను కూడా వెల్లడిస్తుంది. ఇది బడ్జెట్ సమర్పణకు పునాది వంటిది. ఆర్థిక వృద్ధికి ప్రధాన అవరోధాలను గుర్తించడంలో విధాన రూపకర్తలకు ఇది మార్గదర్శకంగా కూడా పనిచేస్తుంది. సర్వేలో రెండు భాగాలు ఉన్నాయి: పార్ట్ ఏ,  పార్ట్ బీ. పార్ట్ ఏ సంవత్సరంలో ప్రధాన ఆర్థిక పరిణామాల వివరాలను,  ఆర్థిక వ్యవస్థ  విస్తృత సమీక్షను అందిస్తుంది. రెండవ భాగంలో సామాజిక భద్రత, పేదరికం, విద్య, ఆరోగ్య సంరక్షణ, మానవాభివృద్ధి,  వాతావరణం వంటి నిర్దిష్ట అంశాలు ఉంటాయి.

ఆర్థిక సంవత్సరం 2024 కోసం ఆర్థిక సర్వే

పార్లమెంటు ఎన్నికల సంవత్సరంలో, కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత .. అంటే జూన్-జులైలో పూర్తి వార్షిక ఆర్థిక నివేదికను సమర్పించినప్పుడు మాత్రమే కేంద్రం సర్వేను సమర్పిస్తుంది. ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ముందు ఆర్థిక సర్వే మాదిరిగానే ఆర్థిక మంత్రిత్వ శాఖ భారత ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను వివరించే 'సంక్షిప్త' పత్రాన్ని సమర్పించవచ్చని గత నెలలో వార్తలు వచ్చాయి. ఇది జీడీపీ వృద్ధి వంటి కీలక సూచికలను,  అంచనాలను కలిగి ఉంటుంది. నామమాత్రపు జీడీపీ వృద్ధి లక్ష్యం,  చమురు ధరలు వంటివి ఇందులో ఉంటాయి. 

ఆర్థిక సర్వే 2023 ఆర్థిక సంవత్సరం ముఖ్యాంశాలు

  • కరోనా  తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ త్వరగా కోలుకుందని సర్వే పేర్కొంది. దీని వృద్ధికి దేశీయ డిమాండ్,  మూలధన పెట్టుబడులు సాయపడ్డాయి. 2022-–23 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో ప్రపంచవ్యాప్తంగా వృద్ధి మందగించడం, వాణిజ్యం తగ్గడం వల్ల ఎగుమతులు తగ్గుముఖం పట్టాయి. 
  • రాబోయే ఆర్థిక సంవత్సరం 2023-–24లో భారత ఆర్థిక వ్యవస్థ 6శాతం నుంచి 6.8శాతం వృద్ధి చెందుతుందని సర్వే పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022–23కి అంచనా వేసిన 7శాతంతో పోల్చితే ఇది తక్కువ.
  • భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంచనా వేసిన 7శాతం వృద్ధి రేటుతో పోల్చితే, 2023-–24 ఆర్థిక సంవత్సరంలో 6.5శాతం వద్ద వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. అధిక క్యాపెక్స్, చిన్న వ్యాపారాలకు క్రెడిట్ వృద్ధి, ప్రైవేట్ వినియోగం, కార్పొరేట్ బ్యాలెన్స్ షీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బలోపేతం చేయడం,  నగరాలకు తిరిగి వచ్చే వలస కార్మికులు జీడీపీ లక్ష్యాలకు కీలకమని స్పష్టం చేసింది. 
  • కరెంట్ ఖాతా లోటు (సీఏడీ) పెరగడం వల్ల భారత రూపాయిపై ఒత్తిడి ఉండొచ్చు.  కరెంట్ అకౌంట్ లోటుకు ఆర్థిక సహాయం చేయడానికి, రూపాయి అస్థిరతను తట్టుకోవడానికి తగినంత విదేశీ మారకం ఉంది.