తగ్గనున్న వంట గ్యాస్ ధరలు ..కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

తగ్గనున్న వంట గ్యాస్ ధరలు ..కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్ దారులకు కేంద్రం గుడ్ న్యూస్ ప్రకటించింది. డీఏను 4శాతం పెంతున్నట్లు తెలిపింది. ఈ మేరకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రస్తుతం 38 శాతంగా ఉన్న డీఏ 42 శాతానికి పెరగనుంది. ఈ మేరకు కేబినెట్‌ భేటీలో తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వెల్లడించారు. డీఏ పెంపుతో కేంద్ర ప్రభుత్వంపై రూ.12,815 కోట్ల భారం పడనున్నట్లు చెప్పారు. 

వంట గ్యాస్, సీఎన్జీ ధరలు తగ్గనున్నాయి. ఈ మేరకు గ్యాస్ ధరల మార్గదర్శకాలకు సవరణలు కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. అంతర్జాతీయ ధరలతో సంబంధం లేకుండా గ్యాస్ ధరలు భారతీయ క్రూడ్ మార్కెట్తో అనుసంధానం కానున్నాయి. సహజ వాయువు ధర భారతీయ క్రూడ్ బాస్కెట్ నెలవారీ సగటులో పది శాతం ఉంచాలని నిర్ణయించింది. స్థిరమైన ధరను నిర్ధారించడానికి కొత్త విధానాన్ని అమలు చేయనుంది. దీంతో నెలవారీగా గ్యాస్ రేట్ల నిర్ణయించనున్నారు. ప్రతికూల మార్కెట్ హెచ్చుతగ్గుల నుంచి ప్రజలకు,  ఉత్పత్తిదారులకు ఉపశమనం అందించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. 

భారత అంతరిక్ష విధానం 2023కి కూడా కేబినెట్ ఆమోదం ముద్ర వేసింది.  ఈ విధానంతో అంతరిక్ష శాఖ పాత్రను మెరుగవడంతో పాటు.. ఇస్రో మిషన్ల కార్యకలాపాలు పెరుగుతాయని భావిస్తోంది.   పరిశోధన, విద్యాసంస్థలు, స్టార్టప్‌లు పరిశ్రమల  పెద్ద భాగస్వామ్యాన్ని అందించడం లక్ష్యంగా భారత అంతరిక్ష విధానం 2023కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.