వాల్వ్ N-95 మాస్కులు కరోనా వ్యాప్తిని ఆపలేవ్: కేంద్ర ఆరోగ్య శాఖ

వాల్వ్ N-95 మాస్కులు కరోనా వ్యాప్తిని ఆపలేవ్: కేంద్ర ఆరోగ్య శాఖ

కరోనా రాకూడదని వాల్వ్‌ ఉన్న మాస్క్‌ వాడుతున్నారా? అయితే మీరు తప్పు చేస్తున్నట్లే లెక్క. ఇప్పటి వరకు వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకకుండా అడ్డుకునే రక్షణ కవచం అనుకుంటున్న వీటితో ఏ మాత్రం ప్రయోజనం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ తేల్చింది. కరోనా వ్యాప్తిని నివారించేందుకు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని చెబుతున్న కేంద్రం తాజాగా కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. వాల్వ్ ఉండే మాస్కులతో ప్రయోజనం లేదని, ముక్కు, నోరు మొత్తం కవర్ అయ్యేలా క్లాత్ మాస్కులు పెట్టుకోవడమే మేలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచిస్తూ లేఖ రాసింది. అప్పటికే కరోనా బారినపడిన వారు ఎన్-95 మాస్కు పెట్టుకున్నా, అసలు మాస్కు లేకుండా తిరిగినా.. రెండూ ఒకటేనని చెప్పింది. వీటిని ప్రజలు, వైద్యులూ ఎవరూ వాడకుండా చూడాలని సూచించింది.

కాపాడట్లే..

మొదట్లో అన్ని రకాల మాస్కుల్లోకెల్లా ఎన్-95 మాస్కులే కరోనా నుంచి సమర్థంగా కాపాడగలవని అంతా అనుకున్నారు. దీంతో వీటికి డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయిపోయింది. అవే డేంజర్ అని నిపుణులు చెబుతున్నారు. కరోనా రాకుండా ఉండేందుకు వాడే మాస్క్‌లు కూడా కొన్నిసార్లుకరోనా వ్యాప్తికి కారణమవుతున్నాయని వారంటున్నారు. ముఖ్యంగా వాల్వ్‌ ఉండే మాస్క్‌లు ఇప్పుడు ఇదే పని చేస్తున్నాయి. మాస్కులు పెట్టుకునేది రెండు కారణాల కోసం. ఒకటి ఇతరుల నుంచి మనకు కరోనా వైరస్ సోకకుండా కాపాడుకునేందుకు. రెండోది మన నుంచి ఎదుటివాళ్లకు అంటుకోకుండా‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉండేందుకు. అయితే ‘వాల్వ్‌ మాస్క్‌’లు మాత్రం ఇతరులకు కరోనా సోకేందుకు కారణమవుతున్నాయంటున్నారు హెల్త్ ఎక్స్‌పర్ట్స్.

పొల్యూషన్‌ ‌ఫిల్టర్ మాత్రమే

కరోనా నుంచి రక్షించేందుకే ఎన్-95 మాస్కులు ఉపయోగపడుతాయని అనుకుంటే పొరపాటు. ఎందుకంటే ‘వాల్వ్‌’ ఉండే మాస్కులు కరోనా విషయంలో కరెక్ట్‌గా‌ పనిచేయవు. వాల్వ్స్ ఉన్న ఎన్‌95 మాస్క్‌లు కూడా వాడకూడదు. ఇవి ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పొల్యూషన్‌ ఉన్న ఇండస్ట్రియల్‌ ఏరియాల్లో వాడేందుకు మాత్రమే తయారయ్యాయి. ఇవి తొడుక్కుంటే గాలిని 95 శాతం వరకు ఫిల్టర్ చేసి పొల్యూటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎయిర్‌నుంచి రక్షణ కల్పిస్తాయి. అంటే స్వచ్ఛమైన గాలి పీల్చుకోగలుగుతారు. కానీ, కరోనా టైమ్‌లో వైరస్‌ల నుంచి ఇవి రక్షణ కల్పించలేవు. ఎవరైనా కరోనా పేషెంట్స్‌, అసింప్టమాటిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కరోనా క్యారియర్స్‌ ‘వాల్వ్‌ మాస్క్‌’ తొడుక్కున్నా.. వాళ్ల నుంచి ఇతరులకు కరోనా వస్తుంది. ఏ మాస్క్‌ అయినా అది తొడుక్కున్నవాళ్లతో పాటు, ఇతరులకూ రక్షణ కల్పించేదిగా ఉండాలి. అయితే ‘వాల్వ్‌ మాస్క్‌’ ఈ పని చేయదు. తొడుక్కున్న వాళ్లకు మాత్రమే కొంతమేర ఉపయోగపడుతుంది.

ఎందుకు తొడుక్కోకూడదు?

వాల్వ్‌ మాస్క్‌లు వన్‌వే వాల్వ్స్‌ కలిగి ఉంటాయి. ఫ్యాబ్రిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాస్క్‌ మధ్యలో లేదా పక్కవైపు ఈ వాల్వ్స్‌ ఉంటాయి. ఇవి ప్లాస్టిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తో తయారై ఉంటాయి. ఇవి ఒకవైపు గాలిని మాత్రమే ఫిల్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తాయి. గాలి పీల్చుకునేటప్పుడు ఈ వాల్వ్స్‌లో ఉన్న ఫిల్టర్స్‌ గాలిని శుభ్రపరుస్తాయి. దీంతో స్వచ్ఛమైన గాలి పీల్చుకోగలుగుతారు. కానీ, గాలి బయటకు వదిలేటప్పుడు ఈ ఫిల్టర్స్‌ పనిచేయకుండా, ఓపెన్‌ అవుతాయి. దీంతో గాలి వేగంగా బయటకు వస్తుంది. అంటే కరోనా ఉన్న వాళ్లు ఈ మాస్క్‌ పెట్టుకున్నా తుమ్మినప్పుడు లేదా శ్వాస వదిలినప్పుడు వైరస్‌ కూడా గాలిలో కలుస్తుంది. మిగతా మాస్క్‌ల్లాగా గాలి ఆగదు కాబట్టి, కరోనా వైరస్‌ గాలిలో కలుస్తుంది. దీనివల్ల మిగతావాళ్లకు వైరస్‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వ్యాపించే ఛాన్స్‌ ఉంది. కాబట్టి, కరోనా కన్ఫమ్‌ అయిన వాళ్లు, లక్షణాలు ఉన్నవాళ్లు మాత్రమే కాదు.. ఎవరూ ‘వాల్వ్‌ మాస్క్‌’లు వాడకూడదు. వాల్వ్‌ మాస్క్‌ తొడుక్కున్న వాళ్లకుమాస్క్‌ ఉన్నా .. లేనట్టే! మాస్క్‌ లేని కరోనా పేషెంట్స్‌ నుంచి వైరస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎలా వ్యాప్తి చెందుతుందో, వాల్వ్‌ మాస్క్‌ తొడుక్కుని ఉన్న వాళ్ల నుంచి కూడా అలాగే వ్యాపిస్తుంది.