తొలి క్యాబినెట్లోనే పెట్రోల్, డీజిల్ ధరల్ని తగ్గిస్తాం: అమిత్ షా

తొలి క్యాబినెట్లోనే పెట్రోల్, డీజిల్ ధరల్ని తగ్గిస్తాం: అమిత్ షా

తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అమల్లోకి వస్తే.. తొలి క్యాబినెట్ లోనే పెట్రోల్, డీజిల్ ధరల్ని తగ్గిస్తామని కేంద్ర హోమంత్రి అమిత్ షా అన్నారు. రైతులకు ఎకరాకు 25 శాతం ఇన్ పుట్ సబ్సిడీ ఇస్తామని చెప్పారు. BJP అధికారంలోకి వస్తే బీసీనే సీఎం చేస్తామని చెప్పారు. ఎస్సీ వర్గీకరణకి కట్టుబడి ఉన్నామన్నారు. ప్రజారోగ్యం  కోసం 10 లక్షల భీమా కల్పిస్తామని తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో  కేంద్ర హోమంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 

తెలంగాణలో బీఆర్ఎస్ కు ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. BRS కారు స్టీరింగ్ MIM చేతిలో ఉందని అమిత్ షా చెప్పారు. దళితులకు 3 ఎకరాలు ఇస్తానన్న కేసీఆర్‌ హామీ ఏమైందని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలని.. బీఆర్ఎస్ ని గద్దె దింపాలని కోరారు. 

పటాన్ చెరు ఎమ్మెల్యే 2వేల ఎకరాల భూమిని కబ్జా చేశారని ఆరోపించారు. నిరుద్యోగులను కేసీఆర్ నట్టేట ముంచారన్నారు. నిరుద్యోగులకు భృతి ఏమైందని నిలదీశారు. 2.50 కోట్ల మందికి కేంద్రం ఉద్యోగాలు ఇచ్చినా.. ఎక్కడ పేపర్ లీక్ కాలేదు.. కానీ తెలంగాణలో మాత్రం ప్రతి పేపర్ లీక్ అవుతుందన్నారు.