ఇయ్యాల బీదర్ కు అమిత్ షా

ఇయ్యాల బీదర్ కు అమిత్ షా

హైదరాబాద్, వెలుగు: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం కర్నాటకలో పర్య టించనున్నారు. బీదర్ జిల్లా బసవ కళ్యాణ్ తాలుకాలోని గోర్ట గ్రామంలో నిజాంపై పోరాడిన అమరవీరుల స్థూపాన్ని, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహన్ని ఆవిష్కరించ నున్నారు. 1948లో ఈ గ్రామంలో రజా కార్లు 200 మందిని ఊచకోత కోసారు. దీన్ని జలియన్ వాలా బాగ్ ఘటనతో అక్క డి పబ్లిక్ పోలుస్తుంటారు. బీజేపీ కార్య కర్త లు, అభిమానులు హాజరై అమిత్ షా ప్రో గ్రాంను సక్సెస్ చేయాలని పార్టీ శ్రేణు లను బీజేపీ స్టేట్ చీఫ్​ సంజయ్ సూచించారు.