క్రిటికల్ మినరల్స్, మైనింగ్ రంగాల్లో సహకారమే లక్ష్యం..25 నుంచి 30 వరకు ఆస్ట్రేలియాలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటన

క్రిటికల్ మినరల్స్, మైనింగ్ రంగాల్లో సహకారమే లక్ష్యం..25 నుంచి 30 వరకు ఆస్ట్రేలియాలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటన

న్యూఢిల్లీ, వెలుగు: భారత్తో పాటు ఆస్ట్రేలియా, ఇతర ప్రపంచ దేశాల మధ్య గనులు, క్రిటికల్ మినరల్స్, ఆధునిక సాంకేతికత, ప్రాసెసింగ్ రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. ఈ నెల 25 నుంచి 30 వరకు సిడ్నీ, మెల్బోర్న్ సిటీల్లో జరగనున్న పలు కీలక కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. 

వివిధ దేశాల ప్రభుత్వ ప్రతినిధులు, మైనింగ్ కంపెనీలు, పారిశ్రామికవేత్తలతో విస్తృతంగా చర్చలు జరపనున్నారు. విదేశీ వనరుల ద్వారా ఖనిజాలను సమకూర్చుకునే అవకాశాలను విస్తరించుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఈ టూర్ సాగనుంది. అలాగే భారత మైనింగ్ ప్రాజెక్టుల్లోకి విదేశీ పెట్టుబడులు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, సంయుక్త పరిశోధనలు, నైపుణ్యాభివృద్ధి, ఖనిజాన్వేషణ (ఎక్స్ప్లొరేషన్) వంటి అంశాలపై కేంద్ర మంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించనున్నట్టు ఆయన కార్యాలయం గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.