
ఆసిఫాబాద్, వెలుగు: కేంద్ర రోడ్డు రవాణా, హైవే , కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి హర్ష మల్హోత్రా మంగళవారం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి బయలుదేరి రెబ్బెన మండలం గోలేటి గెస్ట్ హౌజ్‌కు చేరుకుంటారు. ఆ తర్వాత జిల్లా కేంద్రంలోని లైబ్రరీని సందర్శించి లబ్ధిదారులతో మాట్లాడతారు. ఎంపీడీవో ఆఫీస్ దగ్గర నిర్మించిన ఇందిరమ్మ మోడల్ హౌజ్‌ను పరిశీలిస్తారు. అనంతరం తుంపెల్లిలోని జేజేఎం వద్దకు చేరుకుని లబ్ధిదారులతో మాట్లాడతారు.
సాయంత్రం 5.30 నుంచి 7.30 గంటల వరకు కలెక్టరేట్లో జిల్లా అధికారులు, తిర్యాణి మండల అధికారులతో రివ్యూ నిర్వహించనున్నారు. అనంతరం గోటేటి గెస్ట్ హౌజ్ బస చేసి.. బుధవారం ఉదయం 8 గంటలకు తిర్యాణి మండలం సుంగపూర్ కు బయలుదేరి అక్కడ పీఎం జన్మన్ కింద నిర్మించిన శాటిలైట్ స్కూల్‌ను పరిశీలి స్తారు. 10.30 గంటలకు జన్కాపూర్‌లోని అంగన్వాడీ సెంటర్‌ను పరిశీలించి చిల్డ్రన్స్ బుక్స్‌ను రిలీజ్ చేస్తారు. వాంకిడి పీహెచ్ సీని పరిశీలించనున్నారు.