టీఆర్ఎస్ కో, కేసీఆర్ కో మేం భయపడం

V6 Velugu Posted on Dec 07, 2021

ధాన్యం కొనుగోళ్లపై టీఆర్ఎస్ కావాలనే రాజకీయం చేస్తోందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ప్రచారం కోసమే టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళనలు చేస్తున్నారన్నారు. హుజురాబాద్ లో ఓటమి తర్వాతే ప్లాన్ ప్రకారం టీఆర్ఎస్ ఆందోళనలు  చేస్తుందన్నారు. తాము టీఆర్ఎస్ కో ,కేసీఆర్ కో భయపడబోమన్నారు. బాయిల్డ్ రైస్  ఒప్పందంపై సంతకం చేసింది కేసీఆరేనన్నారు. మెడ మీద కత్తిపెట్టారనేది దురదృష్టకరమన్నారు. మెడమీద కత్తిపెట్టి బెదిరిస్తే.. సంతకం చేయడానికి.. టీఆర్ఎస్ అంత మెతక ప్రభుత్వామా? అని ప్రశ్నించారు. బాయిల్డ్ రైస్  ఒప్పందంపై సంతకం చేసి ఇపుడు సమస్య అంటున్నారన్నారు. గతేడాది ధాన్యం కొనుగోళ్లకు రూ.27 వేల కోట్లు ఖర్చు పెట్టారన్నారు. ధాన్యం కొనుగోళ్లపై పీయూష్ గోయల్ క్లారిటీ ఇచ్చారన్నారు.  ధర్నాలు చేయడం ఆపి..ధాన్యం కొనాలన్నారు.

Tagged TRS, KCR, union minister kishan reddy, paddy, grain purchases

Latest Videos

Subscribe Now

More News