ది బెస్ట్గా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ : కేంద్ర మంత్రి కిషన్రెడ్డి

ది బెస్ట్గా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ : కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
  •  వచ్చే ఏడాది డిసెంబరులో ప్రధానితో ప్రారంభోత్సవం
  • రూ.719 కోట్లతో ఆధునీకరణ పనులు
  • మెట్రో, బస్​స్టేషన్​లకువాక్​త్రూ ఫెసిలిటీ
  • పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి

హైదరాబాద్​సిటీ, వెలుగు: దేశంలోనే సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​ను ది బెస్ట్​గా రూపొందిస్తున్నట్టు కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి తెలిపారు. నిజాం హయాంలో నిర్మాణం జరుపుకున్న ఈ రైల్వేస్టేషన్​లో పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా రూ.719 కోట్లతో పునర్నిర్మాణం చేస్తున్నట్టు వెల్లడించారు. సోమవారం ఆయన రైల్వేస్టేషన్​ను సందర్శించి పనులను పరిశీలించారు. అన్ని పనులు పూర్తి చేసి వచ్చే ఏడాది డిసెంబర్​నాటికి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని కోరారు. ప్రధాని మోదీతో ప్రారంభోత్సవం చేయించనున్నట్టు తెలిపారు. 

శంషాబాద్ ​ఎయిర్​పోర్ట్​ తరహాలో..

సికింద్రాబాద్​రైల్వేస్టేషన్​1,65,566  చ. మీ. విస్తీర్ణంలో నిర్మాణం జరుపుకుంటోందని, రోజుకు 1.97 లక్షల ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారని, ఈ సంఖ్య గంటకు 23వేలుగా ఉందని మంత్రి కిషన్​రెడ్డి చెప్పారు. ఆధునీకరణ తర్వాత గంటకు 35,500 వేల మంది చొప్పున రోజుకు 2.70లక్షలకు చేరుకుంటుందన్నారు. స్టేషన్​లో 3వేల మంది కూర్చునేలా వెయిటింగ్​హాల్, ఆధునిక క్యాంటీన్, రెస్టారెంట్​అందుబాటులోకి రానున్నాయన్నారు. తెలంగాణ కళలు ఉట్టిపడే చిత్రాలను సికింద్రాబాద్​పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామన్నారు. నాలుగు నెలల్లో సౌత్​సైడ్​బ్లాక్​ప్రారంభిస్తామన్నారు. శంషాబాద్​ ఎయిర్​పోర్ట్​తరహాలో సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​ను రూపొందిస్తున్నట్టు కిషన్​రెడ్డి వెల్లడించారు. 

26 లిఫ్టులు, 32 ఎస్కలేటర్లు 

సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​లో 26 లిఫ్ట్​లు, 32 ఎస్కలేటర్లు ఏర్పాటు చేస్తున్నట్టు కిషన్​రెడ్డి తెలిపారు. ట్రైన్​దిగిన వారు నేరుగా మెట్రోస్టేషన్​లకు వెళ్లే విధంగాఈస్ట్, వెస్ట్​ సైడ్​ నేరుగా వాక్​ త్రూ కనెక్టివిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. బస్​ స్టేషన్లకు సైతం వాక్​త్రూ ద్వారానే చేరుకునేలా సదుపాయలు కల్పిస్తున్నామన్నారు. రైలు దిగన వారు బయటకు రాకుండా స్టేషన్​నుంచి మెట్రో, బస్​ స్టేషన్లకు వెళ్లడానికి  అవకాశం ఉంటుందన్నారు. స్టేషన్​పరిధిలో రెండు భారీ సబ్​స్టేషన్లను 5 కిలోవాట్ల కెపాసిటీతో నిర్మిస్తున్నట్టు చెప్పారు. స్టేషన్​భద్రతకు అడ్వాన్సుడ్​సెక్యూరిటీ సిస్టమ్​ఏర్పాటు చేస్తున్నామన్నారు. సౌత్​ సెంట్రల్​ రైల్వే సికింద్రాబాద్​ డివిజన్​అడిషనల్​ జనరల్​మేనేజర్​సత్యప్రకాశ్, డివిజనల్​రైల్వే మేనేజర్​ఆర్​. గోపాలకృష్ణన్​, చీఫ్​అడ్మినిస్ర్టేటివ్​ ఆఫీసర్​రణధీర్​రెడ్డి, పీసీఆర్​ఓఎ. శ్రీధర్​  పాల్గొన్నారు.