ఏపీ నుంచి సీఎంలున్నా.. ఒరిగిందేం లేదు

ఏపీ నుంచి సీఎంలున్నా.. ఒరిగిందేం లేదు

సాగునీటి ప్రాజక్టుల విషయంలో జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని.. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాయలసీమ రణభేరీ సభలో పాల్గొన్న ఆయన.. వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఏపీ నుంచి ఎంతో మంది ముఖ్యమంత్రులుగా ప్రాతినిధ్యం వహించినా.. ఒరిగిందేమి లేదని కిషన్ రెడ్డి విమర్శంచారు. 

‘సీమ ప్రాంతం వెనుకబాటుతనానికి పాలకుల నిర్లక్ష్యమే ప్రధాన కారణం.  వెనుకబడిన ప్రాంతంలో అనేకమైన సంస్ధలను మేం తీసుకోచ్చాం. ఏపీలో లిక్కర్, ల్యాండ్, కాంట్రాక్టర్ల మాఫియా సాగుతోంది.  పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే బాద్యత భాజాపా తీసుకుంది. ప్రజలకు అండగా భాజాపా ఉంటుంది. క్రిష్ణ దేవరాయుల కాలంలో సీమ రతనాల సీమగా విరాజిల్లింది. ఫ్యాక్షన్ సీమ కాదు.  సీమను రతనాల సీమగా మార్పు చేస్తాం. రానున్న రోజుల్లో భాజాపాను అధికారంలోకి తీసుకురావల్సిన భాద్యత సీమ ప్రజలు తీసుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లో అవినీతి, కుటుంబ పాలన పోయి భాజాపా అధికారంలోకి రావాలి. ఏపీకి డబుల్ ఇంజన్ ప్రభుత్వం అవసరం. కడప జిల్లాకు మరోసారి వస్తా.. గండికోటను పూర్తి స్ధాయిలో అభివృద్ది చేస్తాం. శ్రీశైలం దేవస్ధానం కోసం నిధులను కేటాయించి అభివృద్ది చేస్తున్నాం. అన్నవరం, సింహాచలం దేవస్ధానాల అభివృద్దికి కృషి చేస్తున్నాం. రాబోవు రోజుల్లో రోడ్లు, అభివృద్ది జరిగే పరిస్ధితి లేదు. ఎవరైనా ఎన్ని రోజుల పాటు అప్పులు ఇస్తారు.. తెస్తారు? కుటుంబ పాలన పోయి ప్రజాస్వామ్య పాలన రావాలి. జమ్ము కాశ్మీర్ నుంచి కర్నాటక, తమిళనాడు వరకు వారసులే పాలిస్తున్నారు. యూపీలో కుటుంబ పాలనకు వ్యతిరేకంగా భాజాపాకు పట్టంకట్టారు. ప్రజలకు మేలు జరిగేలా పాలన సాగాలంటే భాజాపాతోనే సాధ్యం. అధికార పార్టీ పోలీసులతో కలిసి అన్ని వర్గాల ప్రజలను వేధింపులకు గురి చేస్తోంది. అక్రమ కేసులు పెట్టి భయపెడుతోంది. సభలకు వెళ్లకుండా కుట్రలు చేస్తోంది. ఎంతో కాలం మీ ఆటలు కొనసాగవు. ప్రజాసామ్య వ్యవస్ధలో ఇలా వ్యవహరించడం సరికాదు. నియతృత్వంగా వ్యవహరిస్తూ.. అక్రమ కేసులు పెట్టడం, కుట్రలు చేయడం సరికాదు. ఏపీ అభివృద్దిలో అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఏపీ అప్పులాంధ్రప్రదేశ్‎గా మారింది. సాగు నీటి ప్రాజక్టుల కోసం, ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ఏం చర్యలు చేపట్టారో చెప్పాలి? సీమ ప్రాంత సమస్యలపై గొంతెత్తిన పార్టీ బీజేపినే. వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి బీజేపీ కూటమిని అధికారంలోకి తీసుకొస్తాం. కరోనా వైరస్‎ను దృష్టిలో ఉంచుకొని పేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నాం. టాయ్‎లెట్స్ లేని ఇళ్లు ఉండకూడదని చిత్తశుద్దితో వాటి నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన ఘనత బీజేపిదే. పేదలకు కార్పొరెట్ వైద్యం కోసం ఆయుష్మాన్‎భవ వైద్యం క్రింద 5 లక్షల రూపాయల విలువైన ఆరోగ్యం సేవలందిస్తున్నాం. సీమ ప్రాంతంలో జాతీయ రహదార్ల అభివృద్ది జరగాలంటే రహదారి వ్యవస్ధ ఎంతో అవసరం. జాతీయ రహాదార్ల విషయంలో వాజ్‎పేయి చేసిన సంస్కరణలతో మోడీ ముందుకు వెళ్లుతున్నారు.

For More News..

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మృతి

నెలలో 25 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం

ఆర్ఆర్ఆర్ సినిమాకు తెలంగాణ ప్రభుత్వ గుడ్‎న్యూస్