
- డ్రగ్స్‌కు దూరంగా ఉంటామని అందరూ ప్రతిజ్ఞ చేయాలి
- కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
ఓయూ, వెలుగు: భారత్‌ను డ్రగ్స్ రహిత దేశంగా మార్చేందుకు అందరూ దృఢ నిర్ణయం తీసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పిలుపునిచ్చారు. ఓయూలోని దూరవిద్య కేంద్రం ఆడిటోరియంలో శనివారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. నషా ముక్త్ భారత్ అభియాన్‌లో అందరూ ఐక్యమై, డ్రగ్స్‌కు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయాలన్నారు. మార్పు మనతోనే మొదలు కావాలన్నారు. 2047 నాటికి డ్రగ్స్‌రహిత దేశాన్ని సాధించాలని కోరారు.
విజన్ 2047 పీఎఫ్ వ్యవస్థాపకుడు డాక్టర్ జి. హరిచరణ్ మాట్లాడుతూ.. యువత దేశ అభివృద్ధిలో కీలకమని, ఈ సదస్సు యువతకు అవగాహన కల్పించేందుకు ఉద్దేశించినట్లు తెలిపారు. సదస్సులో ఓయూ కాలేజ్ ఆఫ్ లా ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రాంప్రసాద్, ప్రొఫెసర్ రత్నాకర్ రావు, ప్రొఫెసర్ ఎన్ వెంకటేశ్వర్లు, విజన్ 2047 పీఎఫ్ కోశాధికారి రాజేందర్ నల్లరి తదితరులు పాల్గొన్నారు.
విద్యా బడ్జెట్‌ను తగ్గించడం సరికాదు
సికింద్రాబాద్ రాంగోపాల్ పేట్ డివిజన్ లోని గవర్నమెంట్స్కూల్లో టాయిలెట్లు కడిగే ఆధునిక యంత్రాలను కిషన్ రెడ్డి అందజేశారు. ప్రతి స్కూల్లో ఫుల్ టైమ్ శానిటేషన్ సిబ్బందిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యావ్యవస్థ కోసం కేటాయించిన బడ్జెట్‌ను ప్రభుత్వం తగ్గించడం సరికాదని, గతంలో మాదిరిగానే విద్య కోసం బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు