తెలంగాణ‌ నుంచి రా రైస్ మొత్తం తీసుకుంటాం

తెలంగాణ‌ నుంచి రా రైస్ మొత్తం తీసుకుంటాం

న్యూఢిల్లీ: రా రైస్ తీసుకుంటామని పదేపదే చెబుతున్నా.. తెలంగాణ సర్కార్ కు అర్థం కావడం లేదని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ధాన్యం సేకరణపై రాజ్యసభలో షార్ట్ డిస్కషన్ లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు పీయూష్ గోయల్ సమాధానం చెప్పారు. రా రైస్ తీసుకుంటామని ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాకపోతే తామేం చేయలేమన్నారు. తెలంగాణ సర్కార్ బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని రాసిచ్చిందన్నారు. పంజాబ్ తరహాలో ధాన్యం కొనాలంటున్నారని.. తాము అదే విధానాన్ని పాలో అవుతున్నామని చెప్పారు. కావాలనే తెలంగాణ ప్రభుత్వం కొత్త కహాని చెబుతూ.. రైతులను మోసం చేస్తుందన్నారు. ధాన్యం కొనుగోలుపై ముఖ్య‌మంత్రి ద్వారా న‌న్ను బెదిరిస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ధాన్యం సేకరణ కోసం రాష్ట్రాలకు ముందే 90శాతం నిధులు ఇస్తున్నామని చెప్పారు. రైతుల అకౌంట్లలో డైరెక్టుగా డబ్బులు జమ చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలోని రైస్ మిల్లుల్లో వెరిఫికేషన్ జరుగుతోందని  పీయూష్ గోయల్ పేర్కొన్నారు. 

మరిన్ని వార్తల కోసం..

పరీక్షలను పండుగలా సెలబ్రేట్ చేసుకోవాలె

నిన్న శిలాఫలకమేస్తే.. నేడు కూలగొట్టిన్రు