
కోల్‌బెల్ట్/బెల్లంపల్లి, వెలుగు : ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి పతనం తప్పదని, రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని కేంద్ర ఫిషరీస్, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల శాఖ మంత్రి పురుషోత్తం రూపాల అన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హోటల్సురభి గ్రాండ్, హమాలివాడల్లో మంచిర్యాల నియోజకవర్గం, క్యాతనపల్లి మున్సిపాలిటీలోని ఎంఆర్గార్డెన్స్ లో చెన్నూరు నియోజకవర్గం, బెల్లంపల్లిలోని బాలాజీ మినీ ఏసీ ఫంక్షన్ హాల్లో బెల్లంపల్లి నియోజకవర్గ సమావేశాలు నిర్వహించారు. ఇందులో బీజేపీ అసెంబ్లీ శక్తి కేంద్రాల ఇన్చార్జీలు, లీడర్లు, వివిధ మోర్చా కమిటీల నాయకులు పాల్గొన్నారు.
దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల మాట్లాడుతూ బీజేపీని బలోపేతం చేయడం, వచ్చే ఎన్నికలకు కార్యకర్తలను సన్నద్ధం చేయడంలో శక్తి కేంద్రాల ఇన్చార్జీలు కీలకంగా వ్యవహరించాలన్నారు. బూత్ స్థాయిలో పని చేసే కార్యకర్తలు కష్టపడితేనే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. అంతకు ముందు రామకృష్ణాపూర్‌కు చెందిన బంగారి ప్రసాద్ అనే కార్యకర్త ఇంట్లో మంత్రి భోజనం చేశారు. బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ రఘునాథ్ వెరబెల్లి, జిల్లా ఇన్చార్జి పల్లె గంగారెడ్డి, జనరల్సెక్రటరీలు మునిమంద రమేశ్ , అందుగుల శ్రీనివాస్, పెద్దపల్లి పార్లమెంటు కన్వీనర్ మల్లికార్జున్ , వెంకటేశ్వర్ గౌడ్ పాల్గొన్నారు.