ఇంటర్ పరీక్షలు పెట్టేందుకే  రాష్ట్రాల మొగ్గు

ఇంటర్ పరీక్షలు పెట్టేందుకే  రాష్ట్రాల మొగ్గు


న్యూఢిల్లీ:  సీబీఎస్‌ఈ పన్నెండో క్లాస్, రాష్ట్రాల ఇంటర్ సెకండియర్ బోర్డ్ ఎగ్జాంలపై రాష్ట్రాల మధ్య దాదాపుగా ఏకాభిప్రాయం ఉందని, ఎగ్జాంలు పెట్టేందుకే అన్ని రాష్ట్రాలు మొగ్గు చూపుతున్నాయని ఆదివారం కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ చెప్పారు. ఎగ్జాంలపై జూన్ 1న తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన వెల్లడించారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడ్డ 12వ క్లాస్ బోర్డ్ ఎగ్జాంలు, ఎంట్రెన్స్ ఎగ్జాంల నిర్వహణపై ఆదివారం రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన వర్చువల్ సమావేశం జరిగింది. సమావేశంలో కేంద్ర మంత్రులు రమేశ్ పోఖ్రియాల్, స్మృతి ఇరానీ, ప్రకాశ్ జవదేకర్, సంజయ్ ధోత్రే, వివిధ రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులు, సెక్రటరీలు పాల్గొన్నారు. మీటింగ్ తర్వాత రమేశ్ పోఖ్రియాల్ మీడియాతో మాట్లాడారు. సమావేశంలో సీబీఎస్ఈ ప్రధానంగా రెండు ఆప్షన్లను ప్రతిపాదించిందని, మెజారిటీ రాష్ట్రాలు రెండో ఆప్షన్ కే మొగ్గు చూపుతున్నాయని చెప్పారు. ఎగ్జాంలపై మంగళవారం లోగా పూర్తి వివరాలతో సూచనలు ఇవ్వాలని అన్ని రాష్ట్రాలు, యూటీలను కోరినట్లు ఆయన చెప్పారు. ఇక 12వ క్లాస్ స్టూడెంట్లకు ఎగ్జాంలు పెట్టకుండా ఇతర మార్గాలు ఆలోచించాలని మహారాష్ట్ర సమావేశంలో కోరింది. ఎగ్జాంలకు ముందు స్టూడెంట్లకు వ్యాక్సిన్ లు వేయాలని ఢిల్లీ, కేరళ సూచించాయి. కరోనా కంట్రోల్ అయ్యాక ఎగ్జాంలు పెట్టాలని తమిళనాడు కోరింది.    

సీబీఎస్ఈ ఇచ్చిన ఆప్షన్లు ఇవే.. 

12వ క్లాస్ బోర్డ్ ఎగ్జాంలపై సీబీఎస్ఈ ఆప్షన్ ఏ, ఆప్షన్ బీలను ప్రతిపాదించింది. 
ఆప్షన్ ఏ..  
‘‘19 మేజర్ సబ్జెక్టులకు మాత్రమే ఎగ్జాంలు పెట్టాలి. మేజర్ సబ్జెక్టుల్లో పర్ఫామెన్స్ ఆధారంగా మైనర్ సబ్జెక్టుల్లో అసెస్ మెంట్ చేయాలి. ఎగ్జాంలకు ముందు నెల రోజుల్లో ఏర్పాట్లు చేయాలి. రెండు నెల్లలో ఎగ్జాంలు పెట్టి, రిజల్ట్స్ ప్రకటించాలి. మరో నెల రోజుల్లో కంపార్ట్ మెంట్ ఎగ్జాంలు కూడా పూర్తి చేయాలి. ఒకవేళ ఈ మూడు నెలల విధానం సాధ్యం కాకపోతే.. ఆగస్టు 1 నుంచి 20 వరకు ఎగ్జాంలు పెట్టి, సెప్టెంబర్ 20న రిజల్ట్స్ ప్రకటించాలి” అని సీబీఎస్ఈ ప్రపోజల్ చేసింది. 

ఆప్షన్ బీ.. 

“19 మేజర్ సబ్జెక్టులకు మాత్రమే ఎగ్జాంలు పెట్టాలి. ఎగ్జాం టైంను 180 నిమిషాల నుంచి 90 నిమిషాలకు తగ్గించాలి. కొన్ని ప్రత్యేక సెంటర్లలో మాత్రమే లేదా ఎవరి స్కూళ్లలో వారికి పరీక్షలు నిర్వహించాలి. ఈ ఎగ్జాంలను జులై 15 నుంచి ఆగస్టు 26 మధ్య పెట్టాలి. సెప్టెంబర్ లో రిజల్ట్స్ ప్రకటించాలి” అని సీబీఎస్ఈ వివరించింది. 
వీలైతే జూన్ లాస్ట్ వీక్​లో పెడ్తం: రాష్ట్ర విద్యా శాఖ 
హైదరాబాద్, వెలుగు: కరోనా తీవ్రత తగ్గి, పరీక్షలు పెట్టేందుకు అవకాశం ఉంటే.. జూన్ లాస్ట్ వీక్ లో ఇంటర్ ఎగ్జాంలు పెట్టాలని కేంద్రానికి రాష్ట్ర విద్యా శాఖ సూచించింది. ఆదివారం రాష్ర్టాల విద్యాశాఖ మంత్రులతో కేంద్ర మంత్రులు రాజ్ నాథ్, రమేశ్ పోఖ్రియాల్, తదితరులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశంలో రాష్ట్రం నుంచి విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా పాల్గొన్నారు. జూన్ నెలాఖరులో పరీక్షల నిర్వహణ సాధ్యం కాకపోతే ఆల్టర్నేట్ ఏర్పాట్లు చేశామని కేంద్ర మంత్రులకు చెప్పారు. ఫస్టియర్ మార్కుల ఆధారంగా సెకండియర్ స్టూడెంట్లకు మార్కులు ఇవ్వాలని, రికార్డుల ఆధారంగా ప్రాక్టికల్ మార్కులు వేయాలని భావిస్తున్నట్టు తెలిపారు. టెన్త్ ఎగ్జామ్స్​ను రద్దు చేసిన ప్రభుత్వం, ఇంటర్ పరీక్షలను మాత్రం వాయిదా వేసింది. జూన్ 1న పరిస్థితులను పరిశీలించి, పరీక్షలపై నిర్ణయం తీసుకుంటామని గతంలో ప్రకటించిన విషయం  తెలిసిందే.