
‘బీఎస్ఎన్ఎల్ ’ పై కేంద్రమంత్రి సంజయ్ ధోత్రే
బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగుల జీతాల బకాయిల చెల్లింపునకు ప్రాధాన్యం ఇస్తామని కేంద్ర కమ్యూనికేషన్లశాఖ సహాయ మంత్రి సంజయ్ శ్యామ్ రావ్ ధోత్రే రాజ్యసభలో గురువారం ప్రకటించారు. 2010 నుంచి నష్టాల్లో ఉన్న ఈ ప్రభుత్వ టెల్కోకు రూ.20 వేల కోట్ల అప్పులు ఉన్నాయి. ‘‘బీఎస్‌ఎన్‌ఎల్ పరిస్థితి సభలోని సభ్యులందరికీ తెలుసు. బీఎస్‌ఎన్‌ఎల్ , ఎంటీఎన్ ఎల్ ల కోసం సహాయక ప్యాకే జీని ప్రకటించాం. పరిస్థితి కాస్త మెరుగుపడ్డా క, బకాయిల చెల్లింపునకే తొలి ప్రాధాన్యం ఇస్తాం. ఫండ్స్ రాగానే కాంట్రాక్టు వర్కర్లకూ చెల్లిస్తాం ’’ అని ప్రకటించారు. బీఎస్‌ఎన్‌ఎల్ ఆర్థిక పరిస్థితి బాగా లేనందున, రిటైర్డ్ ఉద్యోగులకు పే రివిజన్ సాధ్యం కాదని టెలికంశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ రాతపూర్వకంగా తెలిపారు. అందుకే, పింఛనును పెంచడానికి ప్రస్తుతానికి ఒప్పుకోలేదని వివరణ ఇచ్చారు. ఉద్యోగుల జీతాలు పెంచేటప్పుడే, ఫింఛన్లనూ పెంచడానికి అవకాశం ఉంటుం దని తెలిపారు. బీఎస్ ఎన్ ఎల్ ఉద్యోగుల్లో 78 వేల మంది, ఎంటీఎన్ ఎల్ ఉద్యోగుల్లో 13,500 మంది వాలంటరీ రిటైర్‌మెంట్
దరఖాస్తు చేసుకున్నారని ధోత్రే వెల్లడాంచారు.