జమ్మూకాశ్మీర్ విభజన బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

జమ్మూకాశ్మీర్ విభజన బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

న్యూఢిల్లీ: ఇండియాని ఇంటి గ్రేట్ చేసిన సర్దార్​ వల్లభ్ భాయ్ పటేల్​ జయంతి నాడే కాశ్మీర్​ కొత్త ఉదయాన్ని చూడబోతోంది. కొత్తగా ఏర్పాటైన జమ్మూకాశ్మీర్ , లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు అక్టోబర్​ 31 నుంచి ఉనికిలోకి రానున్నా యి. పార్లమెంట్ ఓకే చేసిన విభజన బిల్లు కు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్​ శుక్రవారం ఆమోదం తెలిపారు . దీంతో జమ్మూకాశ్మీర్​ విభజన చట్టం 2019 అమల్లోకి వచ్చింది. ఆ వెంటనే ఆవిర్భావ తేదీని ఖరారుచేస్తూ కేంద్ర హోంశాఖ అధికారిక ప్రకటన చేసింది. కాశ్మీర్​కు స్పెషల్​ స్టేటస్​ కల్పించే ఆర్టికల్​ 370ని ఎత్తేస్తూ రాష్ట్రపతి మూడ్రోజుల కిందటే గెజిట్ జారీ చేశారు . శుక్రవారం విభజన చట్టం కూడా అమల్లోకి రావడంతో కొత్త యూటీల ఏర్పాటు ప్రక్రియ పూర్తయింది. ఆర్టికల్​370 రద్దుతో జమ్మూకాశ్మీర్​ విలీనాన్ని పూర్తిచేశామమన్న ప్రధాని నరేంద్ర మోడీ.. దీంతో సర్దార్​ పటేల్​, బీఆర్​ అంబేద్కర్​, శ్యామప్రసాద్​ ముఖర్జీ,వాజపేయి లాంటి దేశనేతలకు ఘన నివాళిలాంటి దని గురువారం నాటి ప్రసంగంలో అన్నారు .జమ్మూలో నేటి నుంచి స్కూళ్లు ఆర్టికల్​ 370 రద్దు, రాష్ట్ర విభజన నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్న కేంద్రం.. శనివారం నుంచి జమ్మూలో 144 సెక్షన్​ ఎత్తేస్తున్నట్లు ప్రకటించింది. స్కూళ్ల నుంచి యూనివర్సిటీల దాకా అన్ని విద్యాసంస్థలు శనివారం నుంచి పని చస్తాయని అధికారులు తెలిపారు .