
- సామాన్యులు బీమాకు దూరమవుతారు
- ఆర్థిక మంత్రి నిర్మలకు నితిన్ గడ్కరీ లేఖ
ఢిల్లీ: జీవిత, వైద్య బీమా ప్రీమియంపై 18% జీఎస్టీ వసూలును ఉపసంహరించుకోవాలని కోరుతూ కేంద్ర రవాణా శాఖ మంత్రి నితన్ గడ్కరీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. కుటుంబానికి రక్షణ కల్పించేందుకు ఉద్దేశించిన ఇన్సూరెన్సు ప్రీమియపై జీఎస్టీ వసూలు చేయడం సరికాదని చెప్పారు. జులై 28వ తేదీన రాసిన ఈ లేఖ ఇవాళ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
లైఫ్ ఇన్సూరెన్సు కార్పొరేషన్ నాగ్ పూర్ డివిజన్ ఉద్యోగుల సంఘం ఇచ్చిన విజ్ఞాపన పత్రాన్ని జత చేస్తూ గడ్కరీ నిర్మలా సీతారామన్ కు లేఖ రాయడం గమనార్హం. ఎవరైనా రిస్కులో ఉంటే వారి రక్షణను చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. ఇలా పన్నులు వేయడం వల్ల సామాన్యులు ఇన్సూరెన్సుకు దూరమవుతారని పేర్కొన్నారు. అందు వల్ల 18% జీఎస్టీని, ఆరోగ్య బీమా, జీవిత బీమా నుంచి ఉపసంహరించుకోవాలని కోరారు.