ఐక్యరాజ్యసమితి కీలక నిర్ణయం.. ఉరిశిక్షను రద్దుచేయండి

ఐక్యరాజ్యసమితి కీలక నిర్ణయం.. ఉరిశిక్షను రద్దుచేయండి

మరణశిక్షను రద్దుచేయాలి లేదా తాత్కాలికంగా నిలిపివేయాలి

నిర్భయ దోషుల ఉరి తర్వాత ఐక్యరాజ్యసమితి కీలక వ్యాఖ్యలు చేసింది. మరణిశిక్షను ఆపేయాలని లేదా తాత్కాలికంగా నిలిపివేయాలని కోరుతూ ఐక్యరాజ్యసమితి ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. నిర్భయను అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారం చేసి ఆమె చావుకు కారణమైన దోషులు శుక్రవారం ఉరితీయబడ్డారు. నిర్భయ దోషులను ఉరితీసిన 24 గంటల్లోనే ఐక్యరాజ్యసమితి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ మరియు సంస్థ ప్రతినిధి స్టీఫేన్ డుజారిక్ ఉరిశిక్షపై స్పందించారు. సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ మాట్లాడుతూ.. ప్రపంచంలోని దేశాలన్నీ మరణశిక్షను ఆపాలని లేదా దానిపై తాత్కాలికంగా నిషేధాన్ని విధించాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఉరిశిక్షను వాడడాన్ని నిలిపివేయాలని.. అదీ కుదరకపోతే కనీసం తాత్కాలికంగా నిషేధించాలని ప్రపంచదేశాలను కోరుతున్నట్లు ఐక్యరాజ్యసమితి ప్రతినిధి డుజారిక్ శుక్రవారం విలేకరుల సమావేశంలో తెలిపారు.

నిర్భయ ఘటన జరిగిన ఏడు సంవత్సరాల తరువాత నలుగురు దోషులు ముఖేష్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26) మరియు అక్షయ్ కుమార్ సింగ్ (31) లను శుక్రవారం ఉదయం 5.30 గంటలకు ఢిల్లీలోని తీహార్ జైలులో ఉరితీశారు. దక్షిణ ఆసియాలోనే అతిపెద్దదైన తీహార్ జైలులో ఒకేసారి నలుగురిని ఉరితీయడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

For More News..

నిత్యావసరాల కోసం రూ.1000 సాయం ప్రకటించిన యూపీ

కరోనా ఎఫెక్ట్: ఉద్యోగుల కోసం సరికొత్త నిర్ణయం తీసుకున్న కేరళ ప్రభుత్వం

కనికా కపూర్‌పై ‘కరోనా’ కేసు నమోదు

కరోనాపై విరుష్క జంట వీడియో సందేశం

కరోనాతో దేశాలు ఆగమాగం