ప్రపంచ దేశాలకు అమెరికా భారీ సాయం

ప్రపంచ దేశాలకు అమెరికా భారీ సాయం

ప్రపంచ దేశాలకు వచ్చే ఆరు వారాల్లోగా 8 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేస్తామని ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్. అమెరికాలో ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్లలో ఇది 13 శాతమన్నారు. కరోనా కట్టడిలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్వీట్ చేశారు. విదేశాలకు పంపే వ్యాక్సిన్లలో ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్లు ఉన్నాయన్నారు. ఇది సరైన సమయంలో తీసుకున్న గొప్ప నిర్ణయమన్నారు బిడెన్. భారత్ కు అన్ని విధాల అండగా ఉంటామన్నారు.