మోదీ, కేడీ కలిసి ఆదిలాబాద్ ను నిర్లక్ష్యం చేశారు : సీఎం రేవంత్ రెడ్డి

మోదీ, కేడీ కలిసి ఆదిలాబాద్ ను నిర్లక్ష్యం చేశారు : సీఎం రేవంత్ రెడ్డి

త్వరలోనే రైతు రుణమాఫీ చేసి తీరుతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాంజీ గోండు పోరాటం మరువలేమని చెప్పారు. నాగోబా జాతరకు కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పారు. కడెం ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. తుమ్మిడి హెట్టి దగ్గర కట్టే ప్రాజెక్టుకు కాకా వెంకటస్వామి సూచనతో బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టామని చెప్పారు. కానీ కేసీఆర్ వచ్చి పేరు మార్చి, డిజైన్ మార్చారని విమర్శించారు. 

ఆదిలాబాద్ లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలు అమలు చేశామని తెలపారు. ఆదిలాబాద్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరాలని కోరారు.  ఆరు గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలు అమలు చేశామని తెలపారు. ఆదిలాబాద్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరాలని కోరారు. తుమ్మడిహెట్టి దగ్గర ఖచ్చితంగా ప్రాజెక్టు కట్టి తీరుతామని వెల్లడించారు. 

ఆదిలాబాద్ యూనివర్సిటీ ఇస్తామని హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి. మోదీ, కేడీ కలిసి సీసీఐ సిమెంట్ ఫ్యాక్టరీని క్లోజ్ చేశారని ఆరోపించారు. తొందర్లోనే సీసీఐ సిమెంట్ ఫ్యాక్టరీని తెర్పిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.