అన్ లాక్ 2 గైడ్ లైన్స్ విడుదల

అన్ లాక్ 2 గైడ్ లైన్స్ విడుదల

సడలింపులు కొన్నే
రాత్రి 10 నుంచి తెల్లారి 5 వరకు కర్ఫ్యూ
జులై 31 వరకు లాక్డౌన్
అన్లాక్ 2 గైడ్లైన్స్ విడుదల

న్యూఢిల్లీ: దేశవ్యాప్త లాక్డౌన్ కు మరిన్ని సడలింపులతో అన్లాక్ 2 గైడ్లైన్స్ ను కేంద్రం సోమవారం ప్రకటించింది. వచ్చే నెలాఖరుదాకా లాక్డౌన్ ను పొడిగించింది. కంటెయిన్మెంట్ జోన్లలో కంప్లీట్ లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని, నిత్యావసరాలకే పర్మిషన్ ఉంటుందని తెలిపింది. పెద్ద సంఖ్యలో జనాలు గుమికూడే ప్రదేశాలు.. మెట్రో, సినిమా హాళ్లు, స్విమ్మింగ్ ఫూల్స్, బార్లు, అసెంబ్లీ హాల్స్ జులై 31 వరకు క్లోజ్ చేసే ఉంటాయని వెల్లడించింది. స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ ఇనిస్టిట్యూట్లు కూడా తెరుచుకోవని పేర్కొంది. రాత్రిపూట కర్ఫ్యూ టైమ్ ను కొద్దిగా సడలించి రాత్రి 10 నుంచి ఉదయం 5 వరకు పరిమితం చేసింది. దుకాణాల్లో ఐదుగురికి మించి ఉండొద్దన్న రూల్ కూ కొంత మినహాయింపునిస్తూ.. కాస్త విశాలంగా ఉన్న షాపులలో ఐదుగురికంటే ఎక్కువ మందిని అనుమతించుకోవచ్చని పర్మిషన్ ఇచ్చింది. సోషల్, పొలిటికల్, స్పోర్స్ట్, ఎంటర్టైన్మెంట్, అకడమిక్, రిలీజియస్ పరమైన కార్యక్రమాలు, ఫంక్షన్ల పై బ్యాన్ కొనసాగుతుందని కేంద్రం వెల్లడించింది. వీటిని ఎప్పుడు తెరవాలనే విషయంలో..
లోకల్ గా పరిస్థితులను పరిశీలించి, ప్రాంతాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.

For More News..

ఒకరిద్దరు చనిపోతే ఇంత బద్నాం చేస్తరా?

మోసపూరిత రాజకీయాలకు ప్రతినిధి పీవీ

ఎంట్రెన్స్ టెస్టులు ఉంటయా..? ఉండవా..?

హైదరాబాద్ తాగునీటిపై ఏపీ కిరికిరి