తెరుచుకున్న మధుర మీనాక్షి ఆలయం

తెరుచుకున్న మధుర మీనాక్షి ఆలయం

మధురై : తమిళనాడులో మంగళవారం నుంచి అన్ లాక్ అమలవుతోంది. మధురైలోని మీనాక్షి ఆలయం తెరచుకుంది. 165 రోజుల తర్వాత ఆలయాన్ని తెరిచి భక్తులను అనుమతిస్తున్నారు అధికారులు. సోషల్ డిస్టెన్స్ ఫాలో అవుతూ మీనాక్షి అమ్మవారిని దర్శించుకుంటున్నారు భక్తులు. ఆలయంలోకి వెళ్లే ముందే టెంపరేచర్ చెకింగ్స్, శానిటైజింగ్ లాంటివి ఏర్పాటు చేసింది ఆలయ కమిటీ.

పదేళ్ల లోపు పిల్లలు, 60 ఏళ్లు దాటిన వృద్ధులను మాత్రం ఆలయంలోకి అనుమతించడంలేదు. వైరస్ వ్యాప్తిని నివారించేందుకు ముందు జాగ్రత్త చర్యగా భక్తులకు ఎలాంటి ఆహార పదార్థాలు అందించడం లేదని అధికారులు తెలిపారు. కొబ్బరికాయలు, పండ్లు, దండలు ఆలయంలోకి అనుమతించ లేదు. నెలల తరువాత అమ్మవారిని దర్శించుకోవడంపై భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.