రాత్రి 11 గంటలకే స్ట్రీట్ ఫుడ్స్ స్టాల్స్ క్లోజ్ చేయండి

రాత్రి 11 గంటలకే స్ట్రీట్ ఫుడ్స్ స్టాల్స్ క్లోజ్ చేయండి

హైదరాబాద్ పుడ్ లవర్స్ కు ఓ న్యూస్. ఇది మీ కోసమే. ఇకపై ఎనీ టైమ్ స్ర్టీట్ పుడ్ తినేందుకు గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్ వంటి ప్రాంతాలకు వెళ్తే మీకు నిరాశే ఎదురుకావొచ్చు. మరీ ముఖ్యంగా రాత్రి 11 తర్వాత ఐటీ కంపెనీలు ఉండే ప్లేస్లకు వెళ్తే అంతే సంగతి. మీకు ఇష్టమైన పుడ్ ను ఆర్డర్ చేసుకుని.. ఎంతో ఇష్టంగా.. మరెంతో కమ్మగా తిందామని వెళ్తే గనుక ఆ కోరిక నేరవేరకపోవచ్చు. ఎందుకంటే పుడ్ లవర్స్ తో పాటు హైదరాబాదీలు ఈ స్టోరీ చదవాల్సిందే..! 

గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఐటీ కంపెనీలు ఉంటాయి. ఇక్కడ ఉద్యోగులు షిప్ట్ ల ప్రకారం పని చేయాల్సి ఉంటుంది. చాలామంది ఐటీ ఉద్యోగులు తమ ఇండ్ల నుంచి టిఫిన్స్ బాక్సులు, స్నాక్స్ వంటి పుడ్ ఐటమ్స్ ను ఆఫీసులకు తమ వెంట తీసుకు వెళ్లరు. ఆకలి వేసినప్పుడు తమ ఆఫీసుల దగ్గర్లో ఉండే క్యాంటీన్లు, హోటల్స్, స్ర్టీట్​లో అమ్మే పుడ్ ఐటమ్స్ ను ఎక్కువగా తింటుంటారు. రోడ్లపై అమ్మే పుడ్​ఐటమ్స్ కు ఎప్పుడు చూసినా పుల్ గిరాకీ ఉంటుంది. ఐటీ ఉద్యోగుల రద్దీతో సందడిగా ఉంటాయి ఇక్కడి రోడ్లు. ఐటీ కంపెనీలు ఉండే ఈ ప్రాంతాల్లో ఉదయం మొదలుకొని అర్ధరాత్రి వరకు స్ర్టీట్ పుడ్​దొరుకుతుంది. జనం కూడా ఆ రేంజ్ లోనే ఉంటారు. ఇక్కడ తమకు నచ్చిన పుడ్ ను ఆర్డర్ చేసుకుని మరీ ఎగబడి తింటుంటారు. 

ఇక్కడ దొరకని పుడ్ అంటూ ఏమీ ఉండదు. చికెన్ షావర్మా, బిర్యానీ, కబాబ్‌లు, మ్యాగీ నుండి దోస, మోమోలు, పండ్ల రసాలు, ఐస్‌క్రీమ్‌లు అన్ని దొరుకుతాయి.ఈ ప్రాంతం చాలామంది చిరువ్యాపారులకు ఉపాధి ఇస్తోంది. అయితే.. హైదరాబాద్​ పోలీసులు తీసుకున్న నిర్ణయంపై ఇక్కడి చిరు వ్యాపారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగే వరకు.. గచ్చిబౌలి ప్రాంతంలో స్ట్రీట్ పుడ్స్ ను రాత్రి 11 లోపు వరకే అమ్మాలని షరతు విధించారు. రాత్రి 11 తర్వాత కూడా దుకాణాలు తెరిచి ఉంచొద్దని ఆదేశించారు. వీధి వ్యాపారులను రాత్రి 11 గంటలలోపు దుకాణాలు మూసివేయాలని హైదరాబాద్​ పోలీసులు ఆదేశించారు. దీనిపై ఇప్పుడు చిరు వ్యాపారులు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.  రాత్రి సమయాల్లోనే తమకు ఎక్కువగా గిరాకీ ఉంటుందని, ఇప్పుడు రాత్రి 11 గంటల లోపే దుకాణాలు మూసేస్తే తమ పరిస్థితి ఏంటని వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. రాత్రి 11 గంటల లోపే దుకాణాలు మూసేస్తే తమకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు నెలరోజుల పాటు రాత్రి 11 గంటల లోపే దుకాణాలు మూసివేస్తే నష్టం వస్తుందంటున్నారు. 

అంతేకాదు.. హైదరాబాద్​ పోలీసుల నిర్ణయంపై పట్ల ఐటీ ఉద్యోగులు కూడా తమదైన స్టైల్లో సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. రాత్రి సమయాల్లోనే ఎక్కువగా తాము ఉద్యోగాలు చేయాల్సి ఉంటుందని, ఆ సమయంలో పుడ్ కోసం బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరికొందరు. అర్ధరాత్రి వేళ తమకు ఫుడ్ లేకపోతే తమ పరిస్థితి ఏంటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.