అకాల వర్షం..తడిసిన ధాన్యం

అకాల వర్షం..తడిసిన ధాన్యం
  • ఉమ్మడి వరంగల్​జిల్లాలో పలుచోట్ల వర్షం

ఉమ్మడి వరంగల్​ జిల్లాలో శనివారం ఉదయం పలుచోట్ల వర్షం కురిసింది. వరంగల్​పట్టణంలో కురిసిన వర్షానికి రోడ్లపై నీరు చేరింది. స్థానిక ప్రజలు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జనగామ జిల్లా బచ్చన్నపేట, నర్మెట్ట మండలాల్లోని పలు గ్రామాల్లో అకాల వర్షం రైతులను ఇబ్బందులకు గురిచేసింది.

వడ్ల కుప్పలు తడిసిపోయాయి. బొమ్మకూర్​ కొనుగోలు కేంద్రంలో వరద నీటికి వడ్లు కొట్టుకుపోయాయి. ఎల్కతుర్తి మండల కేంద్రంతోపాటు చింతలపల్లి, గోపాల్‌‌పూర్, సూరారం గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో ధాన్యం తడిసింది. 

 -‌‌‌‌ ‌‌‌‌బచ్చన్నపేట/ ఎల్కతుర్తి, వెలుగు