అకాల వర్షాలకు 2వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నయ్ : మంత్రి తుమ్మల

అకాల వర్షాలకు 2వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నయ్ :  మంత్రి తుమ్మల

రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలకు 2200 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని అన్నారు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. నారాయణపేట, కామారెడ్డి, నిజామాబాద్, నాగర్ కర్నూలు, యాదాద్రి, సిద్దిపేట జిల్లాలలో పంటనష్టం తీవ్రంగా జరిగినట్లు గుర్తించామని చెప్పారు. నష్టం జరిగిన ప్రాంతాలను వెంటనే సందర్శించి..వివరాలను సేకరించాలని ఉద్యానవనశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. 

వరికోతలు ఊపందుకున్న కారణంగా..వచ్చే రెండు మూడు వారాలు జాగ్రత్తగా ఉండాలని.. అకాలవర్షాలు సంభవించే సమయంలో పంటనష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్లతో సమన్వయంచేసుకుంటూ.. మార్కెట్లు, కొనుగోలు సెంటర్లకు వచ్చిన ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే 2లక్షలకుపైగా టార్పలిన్ కవర్లను రైతులు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు మంత్రి తుమ్మల.