యూపీలో జర్నలిస్ట్ హత్య కేసు.. ఇద్దరు నిందితుల ఎన్ కౌంటర్

యూపీలో జర్నలిస్ట్ హత్య కేసు.. ఇద్దరు నిందితుల ఎన్ కౌంటర్

సీతాపూర్: యూపీలో ఓ జర్నలిస్ట్ హత్య కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు సోదరులను గురువారం పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. అయితే, జర్నలిస్ట్ భార్య ఈ ఎన్ కౌంటర్ ను ఖండించింది. కేసును సీబీఐకి ఇవ్వాలని డిమాండ్  చేసింది. జర్నలిస్ట్ రాఘవేంద్ర బాజ్ పాయ్ హత్య కేసు నిందితులు  హర్దోయ్– సీతాపూర్ బార్డర్ ను దాటడానికి ప్లాన్ వేసినట్టు పోలీసులకు సమాచారం అందింది. 

దీంతో ఎస్ టీఎఫ్ టీమ్ తో కలిసి పోలీసులు కూంబింగ్ చేపట్టారు. మోటార్ సైకిల్‌‌ పై వెళ్తున్న ఇద్దరు నిందితులు రాజు తివారీ, సంజయ్ తివారీ  పోలీసులను చూడగానే కాల్పులు జరిపారు. పోలీసులు ఎదురుకాల్పులు జరుపగా నిందితులిద్దరూ మరణించారు. ఎన్ కౌంటర్ పై రాఘవేంద్ర బాజ్ పాయ్ భార్య రష్మి బాజ్‌‌పాయ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేసింది. కాగా, రాఘవేంద్ర బాజ్ పాయ్ లక్నో–-ఢిల్లీ జాతీయ రహదారిపై మార్చి 8న మోటార్‌‌సైకిల్‌‌ పై  సీతాపూర్‌‌ కు వెళ్తుండగా దుండగులు హత్య చేశారు.