యూపీలో మొదలైన ఎన్నికల సందడి

యూపీలో మొదలైన ఎన్నికల సందడి

ఉత్తరప్రదేశ్ లో మొదటి దశ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇవాళ్టి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 21 వరకు నామినేషన్లు ఉంటాయి. ఫస్ట్ ఫేజ్ లో 58 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. సహరన్ పూర్, కైరానా, షామ్లీ, ముజఫర్ నగర్, బిజ్నోర్, మొరాదాబాద్, రాంపూర్, మీరట్, బాఘ్ పట్, ఘజియాబాద్, ఆగ్రా లాంటి కీలక నియోజకవర్గాల్లో మొదటి దశలోనే పోలింగ్ జరగనుంది. మొత్తం 11 జిల్లాలు ఫస్ట్ ఫేజ్ లో ఓటింగ్ కు వెళ్లనున్నాయి. అయితే అధికార పార్టీ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. కాంగ్రెస్ 125 మంది, సమాజ్ వాదీ కూటమి 29 మందితో ఫస్ట్ లిస్ట్ ప్రకటించాయి. ఫిబ్రవరి 10న మొదటి దశ పోలింగ్ జరగనుంది. 403 స్థానాలున్న ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో జరుగుతాయి. ఓట్ల లెక్కింపు మార్చి 10న జరుగుతుంది. 

ఇవి కూడా చదవండి: 

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారు

బెంగాల్లో గంగాసాగర్ మేళా ప్రారంభం