యూపీలో చరిత్ర సృష్టించిన యోగి

యూపీలో చరిత్ర సృష్టించిన యోగి

ఉత్తరప్రదేశ్‌‌లో బీజేపీ ఘన విజయం సాధించి వరుసగా రెండోసారి ఆ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. అదొక రికార్డు అయితే, యూపీకి అయిదేండ్లపాటు పూర్తికాలం పాలించిన సీఎంగా యోగి ఆదిత్యనాథ్‌‌ రికార్డు సృష్టించారు. ఇంతకుముందు ఇద్దరు సీఎంలు బీఎస్పీ చీఫ్ మాయావతి, ఎస్పీ చీఫ్‌‌ అఖిలేశ్ యాదవ్‌‌ మాత్రమే ఆ రాష్ట్రాన్ని అయిదేండ్లపాటు పూర్తిగా పాలించారు. ఇక, రెండోసారి సీఎంగా యోగి బాధ్యతలు తీసుకుంటే పలు రికార్డులను ఆయన సొంతం చేసుకోనున్నారు. 
137 ఏండ్లలో ఫస్ట్‌‌ టైమ్
ఒకవేళ సీఎంగా యోగి ఆదిత్యనాథ్‌‌ను బీజేపీ ఎన్నుకుంటే.. రాష్ట్రానికి రెండోసారి సీఎం అయిన అయిదో నేతగా యోగి రికార్డు సృష్టించనున్నారు. 1985లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి కాంగ్రెస్‌‌కు చెందిన ఎన్‌‌డీ తివారి తర్వాత ఎవరూ అధికారాన్ని నిలబెట్టుకోలేదు. బీజేపీ తరఫున కల్యాణ్‌‌సింగ్, రామ్‌‌ప్రకాశ్‌‌ గుప్తా, రాజ్‌‌నాథ్‌‌సింగ్‌‌లు యూపీకి సీఎంలుగా పనిచేసినా.. యోగి మాత్రమే వరుసగా రెండోసారి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. 
2 సీఎంగా ఎమ్మెల్యే..
గడిచిన 15 ఏండ్లుగా ఉత్తరప్రదేశ్‌‌కు ఎమ్మెల్సీలే సీఎంగా ఉంటున్నారు. మాయావతి, అఖిలేశ్‌‌ యాదవ్‌‌ కూడా ఎమ్మెల్సీలుగానే సీఎం అయ్యారు. యోగి ఆదిత్యనాథ్‌‌ కూడా ఎమ్మెల్సీగానే సీఎం పదవికి ఎన్నికయ్యారు. ఇప్పుడు కూడా యోగినే సీఎంగా కొనసాగిస్తే.. ఎమ్మెల్యే సీఎం అవుతారు. 
3ఫస్ట్‌‌ బీజేపీ సీఎం
యూపీలో రెండోసారి బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చిన మొదటి సీఎంగా కూడా యోగి రికార్డు సృష్టించనున్నారు.