ఇంత క్రూరంగా ఎలా మారుతున్నారు : కోతిని కొట్టి కొట్టి చంపారు..

ఇంత క్రూరంగా ఎలా మారుతున్నారు : కోతిని కొట్టి కొట్టి చంపారు..

మనుషుల్లో రోజురోజుకు దయ, మానవత్వం పోతుంది. విషయం ఏదైనా క్రూరంగా ఆలోచిస్తున్నారు అనటానికి ఇదో సాక్ష్యం.. వీధిలో తిరుగుతున్న ఓ కోతి విషయంలో ఇద్దరు కుర్రోళ్లు వ్యవహరించిన తీరు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ కోతిని కర్రతో కొట్టి కొట్టి చంపటం.. అత్యంత క్రూరంగా వ్యవహరించటం అనేది కలచి వేస్తుంది. కోతి అల్లరి చేస్తుంటే కర్రతో బెదిరించొచ్చు.. మీదకు రాకుండా కర్రంతో కొట్టం వరకు ఓకే.. అంతకు మించి.. కోపం, కసి, క్రూరత్వం అనేది మంచిది కాదు.. ఎలాంటి సమయాల్లోనూ ఇది మంచి పరిణామం కూడా కాదు. పూర్తి వివరాల్లోకి వెళితే...

ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ ప్రాంతంలో జంతు హింసకు సంబంధించిన ఓ కేసు ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఎలాంటి దయ లేకుండా ఒక కోతిని కొట్టి చంపిన ఓ వీడియో ఆన్‌లైన్‌లో కనిపించడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రూరమైన చర్యను ఎత్తిచూపిస్తూ సీనియర్ జర్నలిస్ట్ ఈ వీడియోను ట్వీట్ చేశారు. ఈ వీడియోలో ఇద్దరు వ్యక్తులు చేతిలో కర్రలతో కనిపిస్తుండగా.. ఓ కోతిని వీధుల్లో దారుణంగా కొట్టుకుంటూ వెళ్తుండడం చూడవచ్చు. ఆ తర్వాత ఆ కోతిని అలా కొట్టుకుంటూనే ఓ మురుగు కుంటలో పడేయం కూడా ఈ వీడియోలో కనిపిస్తోంది.

అయితే ఈ ఘటనకు గల కారణాలేవైనా ఇలా జంతుహింసకు పాల్పడడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రజలు కోతుల దాడికి ప్రతీకారం తీర్చుకున్నారా? లేదంటే ఇంకేదైనా కారణముందా అన్నది మాత్రం వెల్లడి కాలేదు. ఈ మే నెలలో కోతులు వెంబడించి దాడి చేయడంతో 45 ఏళ్ల రైతు తన ఇంటి డాబా మీద నుంచి పడి చనిపోయాడు, ఆ తర్వాత ఓ మహిళ కూడా కోతుల దాడిలో ప్రాణాలు కోల్పోయింది.

बदायूं में बंदर को लाठी से पीटकर ले जाते युवकों का वीडियो वायरल, मरणासन्न स्थिति में बंदर को कीचड़ के गड्ढे में फेंका, हुई मौत, फैजगंज बेहटा थाना क्षेत्र के गांव दांवरी का मामला @budaunpolice @igrangebareilly @Uppolice @Abhimanyu1305 @tripathiji1999 @Gaurav_ddk @Gpraksh07 @dgpup pic.twitter.com/sH6e4x37aq

— Balram Singh Chauhan (@Balramsingh_C) July 27, 2023