గవర్నమెంట్ టీచర్‌.. పిల్లలకు పాఠాలు చెప్పకుండా ఇదేం పని

గవర్నమెంట్ టీచర్‌..  పిల్లలకు పాఠాలు చెప్పకుండా ఇదేం పని

స్కూల్‌లో  విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా తన డ్యూటీని మర్చిపోయిన ఓ ఉపాద్యాయుడిని సస్పెండ్ చేశాడు జిల్లా కలెక్టర్. ఉత్తరప్రదేశ్ సంభాల్ జిల్లా మెజిస్ట్రేట్ రాజేంద్ర పన్సియా ఓ స్కూల్ ను అకస్మిక తనిఖీ చేశారు. ప్రియమ్ గోయిల్ అనే ఉపాధ్యాయుడు పిల్లలకు పాఠాలు చెప్పకుండా గంటల తరడడి ఫోన్లో  లీనమైతున్నాడు. ఫస్ట్ స్కూల్ లోకి వెళ్లిన కలెక్టర్ విద్యార్థుల నోట్స్ చూస్తే అన్నీ తప్పులే ఉన్నాయి. ఓ ఆరుగురు స్టూడెంట్స్ నోట్ బుక్స్ చూస్తే ఆరు పేజీల్లోనే 95 తప్పులు కనిపించాయి కలెక్టర్ కు.. అనుమానం వచ్చి టీచర్ ఫోన్ చెక్ చేశాడు.
 
అధికారి టీచర్ ఫోన్ లో డిజిటల్ వెల్ బీయింగ్ ఆప్షన్ ఓపెన్ చేసి చూస్తూ షాక్ అయ్యాడు. స్కూల్ లో ఉన్న టైంలో గోయిల్ రెండు గంటలు క్యాడీ క్రష్ ఆడుతున్నాడని, 26 నిమిషాలు ఫోన్ మాట్లాడుతున్నాడని, 30 నిమిషాలు సోషల్ మీడియాల యాప్స్ వాడుతున్నాడని తేలింది. దీంతో ఈ విషయంపై సీరియస్ అయిన సంభాల్ జిల్లా కలెక్టర్ అతన్ని సస్పెండ్ చేశాడు. ఉపాద్యాయుడి నిర్వాకం బయటపడింది. వెంటనే  డ్యూటీ నుంచి టీచర్ ను కలెక్టర్ తొలగించాడు.