2024లో రాబోయే మహీంద్రా కొత్త కార్లు ఇవే..

2024లో రాబోయే మహీంద్రా కొత్త కార్లు ఇవే..

ప్రముఖ భారతీయ కార్ల తయారీ సంస్థ మహీంద్రా రాబోయే సంవత్సరంలో (2024) అనేక కొత్త మోడళ్లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. కొన్ని ఫేస్ లిఫ్ట్ లతోపాటు చాలా కాలంగా ఎదురు చూస్తున్న కొత్త ఉత్పత్తులను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.  2024లో అమ్మకానికి రానున్న మహీంద్రా కార్ల గురించి వివరంగా తెలుసుకుందాం ..

మహీంద్రా థార్ 5- డోర్ 

మహీంద్రా థార్ 5- డోర్  2024లో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వాటిలో ఒకటి. SUV టెస్ట్ మ్యూల్ లో LED లైటింగ్ అమరిక, సన్ రూప్ తో కూడిన స్థిరమైన మెట్ టాప్ తో వస్తోంది. రాబోయే మహీంద్రా థార్ ఇంజన్ దాదాపు 3 డోర్ వెర్షన్ల మాదిరిగానే ఉంటాయి. కొద్దిగా ట్యూన్ చేయబడిన 2.0 లీటర్ టర్బో పెట్రోల్, 2.2 లీటర్ డిజిల్ ఇంజన్ గరిష్టంగా 150bhpశక్తిని, 300-320Nm గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. రెండు ఇంజన్లు మాన్యువల్ , ఆటోమేటిక్ టాన్స్మిషన్ లలో ఉంటాయి. అంతేకాకుండా మహీంద్రా SUV బహుశా ఫోర్ వీల్ డ్రైవ్ (4WD) రియల్ వీల్ డ్రైవ్(RWD) రెండింటిలోనూ అందుబాటులో ఉండబోతోంది. 

మహీంద్రా XUV400 ఫేస్ లిఫ్ట్ 

మహీంద్రా మహీంద్రా XUV300 కి అప్ గ్రేడ్ గా మహీంద్రా XUV400 ఫేస్ లిఫ్ట్  అందిస్తోంది మహీంద్రా సంస్థ. ఎలక్ట్రిక్ SUV కోసం రివైజ్డ్ వీల్స్, రీవర్క్డ్ ఫ్రంట్ ఫాసియా, మరికొన్ని ఇంటీరియర్ సౌకర్యాలతో రాబోతోందని తెలుస్తోంది. XUV400 EV jy'g 34.5 kwh, 39.4 kwnబ్యాటరీ ప్యాక్ ఎంపికలు అలాగే ఉంటాయి. ఇది సుదీర్ఘ డ్రైవింగ్ పరిధిని కలిగి ఉండవచ్చు. ఇది రూ. 16 లక్షల (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధరను కలిగి ఉండవచ్చు. 

కొత్త మహీంద్రా XUV300

 మహీంద్రా XUV300 బస్ కాంపాక్ట్ వాహనంలో కొత్త అల్లాయ్ వీల్స్, కనెక్ట్ చేయబడిన LED టైల్యాంప్ అమరిక, LED DRLS,  హెడ్ లైట్తో కూడిన కొత్త ఫ్రంట్ ఫాసియా ఉంటుంది. ఫీచర్ సెట్ విషయానికి వస్తే రీడిజైన్ తర్వాత కారు క్యాబిన్ లో ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ సిస్టమ్ చేర్చబడుతుందని అంచనా. మార్కెట్ లో ప్రత్యర్థులతో కొనసాగడానికి ఇది ADAS తో కలిసి ఉండవచ్చు. ఇందులో 1.5 లీటర్ డీజిల్ , రెండు టర్బో పెట్రోల్ ఇంజన్లు ఉన్నాయి.