జూన్ 21న తెలుగులో ఉపేంద్ర మూవీ రీ రిలీజ్‌

జూన్ 21న  తెలుగులో  ఉపేంద్ర మూవీ  రీ రిలీజ్‌

కన్నడ స్టార్ ఉపేంద్ర హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన సూపర్ హిట్ మూవీ ‘ఏ’ రీ రిలీజ్‌‌ అవుతోంది. ఉపేంద్రకు చెందిన ఉప్పి క్రియేషన్స్‌‌తో కలిసి చందు ఎంటర్‌‌‌‌టైన్మెంట్స్‌‌ బ్యానర్‌‌‌‌పై లింగం యాదవ్‌‌ ఈ చిత్రాన్ని జూన్ 21న  తెలుగులో మళ్లీ విడుదల  చేస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌‌ను నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఉపేంద్ర మాట్లాడుతూ ‘ఈ సినిమా నా జీవితంలో మరిచిపోలేనిది. 

26 ఏళ్ల క్రితం ఈ చిత్రం విడుదల అవుతున్న సమయంలో ఎంత ఉత్సాహంగా ఉన్నానో ఇప్పుడు కూడా అంతే ఉత్సాహంగా ఉన్నాను. రీ రిలీజ్‌‌లోనూ ఈ చిత్రానికి మంచి ఆదరణ దక్కుతుంది’ అని అన్నారు.  4కె క్వాలిటీతో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని తెలుగు నిర్మాతలు లింగం యాదవ్, సైదులు అన్నారు.