V6 News

డిఫెన్స్ అకాడమీలో వందల ఉద్యోగాలు..ఇంటర్ పాసైతే చాలు.. పూర్తి వివరాలు ఇవే...

డిఫెన్స్ అకాడమీలో వందల ఉద్యోగాలు..ఇంటర్ పాసైతే చాలు.. పూర్తి వివరాలు ఇవే...

భారత త్రివిధ దళాల్లో చేరి దేశానికి సేవ చేయాలనుకునే విద్యార్థులకు గొప్ప అవకాశం. ప్రతి ఏడాది రెండుసార్లు నిర్వహించే నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA), నేవల్ అకాడమీ (ఐఎన్ఏసీ)– I 2026 నోటిఫికేషన్​ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. ఇంటర్మీడియట్ అర్హతతో  ఎంపికైన అభ్యర్థులు ఉచితంగా డిగ్రీ చదవవచ్చు. శిక్షణ అనంతరం త్రివిధ దళాల్లో  లెఫ్టినెంట్, సబ్ - లెఫ్టినెంట్, ఫ్లయింగ్ ఆఫీసర్/ గ్రౌండ్ డ్యూటీ ఆఫీసర్ హోదాలో ఉద్యోగ జీవితం ప్రారంభించి అత్యున్నత స్థాయికి ఎదగవచ్చు. 


నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాల్లో 157వ కోర్స్, 119వ ఇండియన్ నేవల్ అకాడమీ కోర్స్ (INAC)లో ప్రవేశాల కోసం యూపీఎస్​సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత  గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేయవచ్చు. అప్లికేషన్లు  సమర్పించడానికి చివరి తేదీ 2025, డిసెంబర్ 30.

పోస్టుల సంఖ్య: మొత్తం 394 (పురుషులు 370, మహిళలు 24) .

విభాగాల వారీగా ఖాళీలు:  ఎన్​డీఏ –ఆర్మీ 208 (పురుషులు 198, మహిళలు 10), ఎన్​డీఏ నేవీ (ఆల్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్) 42 (పురుషులు 37, మహిళలు 05), ఎన్​డీఏ ఎయిర్​ఫోర్స్ ఫ్లయింగ్ 92 (పురుషులు 90, మహిళలు 02), ఎన్​డీఏ ఎయిర్ ఫోర్స్ గ్రౌండ్ డ్యూటీస్ టెక్నికల్ 18 (పురుషులు 16, మహిళలు 02),  ఎన్​డీఏ ఎయిర్​ఫోర్స్ గ్రౌండ్ డ్యూటీస్ నాన్​–టెక్నికల్ 08 (పురుషులు 02, మహిళలు 10),  ఇండియన్ నేవల్ అకాడమీ– 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ (119వ ఐఎన్ఏసీ ఆల్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్) 24 (పురుషులు 21, మహిళలు 03).

ఎలిజిబిలిటీ:
ఎన్​డీఏ (ఇండియన్ ఆర్మీ వింగ్): గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి 10 + 2 లేదా సమాన అర్హత కలిగి ఉండాలి. 
ఎన్​డీఏ (ఎయిర్​ఫోర్స్, నేవల్ వింగ్స్), ఇండియన్ నేవల్ అకాడమీలో 10+2 క్యాడెట్ 

ఎంట్రీ స్కీమ్: గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి 10 + 2 లేదా సమాన అర్హత కలిగి ఉండాలి. 12వ తరగతి/ ఇంటర్మీడియట్ స్థాయిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులుగా చదివి ఉండాలి.  ఇంటర్మీడియట్ చివరి సంవత్సరం లేదా 12వ తరగతి చదువుతున్న అభ్యర్థులు కూడా అప్లై చేయవచ్చు. అయితే, 2026, డిసెంబర్ 10 నాటికి 12వ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన సర్టిఫికెట్ కలిగి ఉండాలి. 

ఫిజికల్ స్టాండర్డ్స్ 
ఎత్తు: పురుష అభ్యర్థులు కనీసం 157 సెం.మీ, మహిళా అభ్యర్థులు కనీసం 152 సెం.మీ ఉండాలి. ఫ్లయింగ్ బ్రాంచ్ కోసం కనీసం 162.5 సెం.మీ (పురుషులు & స్త్రీలు ఇద్దరూ) ఉండాలి. గూర్ఖా, ఈశాన్య ప్రాంత కొండలు, గర్హ్వాల్, కుమావున్ అభ్యర్థులకు కనీసం 5 సెం.మీ తగ్గింపు వర్తిస్తుంది. 

వయోపరిమితి 
కనీస వయసు: 16 సంవత్సరాల ఆరు నెలలు అంటే 2010, జులై 1వ తేదీ కంటే తర్వాత జన్మించి ఉండకూడదు. 
గరిష్ట వయసు: 19 సంవత్సరాల ఆరు నెలలు అంటే 2007, జులై కంటే ముందు జన్మించి ఉండకూడదు. 2007, జులై 1 నుంచి 2010 జులై 01 మధ్యలో జన్మించిన అవివాహితులైన పురుషులు, మహిళలు మాత్రమే అర్హులు. 

కోర్స్: నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నేవల్ అకాడమీ(10+ 2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్) ఎగ్జామ్ లో ప్రతిభ కనబర్చిన అభ్యర్థులు డిగ్రీ కోర్సులకు ఎంపికవుతారు. ఎంపికైన అభ్యర్థులు బీఏ, బీఎస్సీ, బీటెక్ కోర్సులను ఉచితంగా చదవొచ్చు. 

ట్రైనింగ్: ఫైనల్ సెలెక్షన్స్​లో ఎంపికైన అభ్యర్థులు నేషనల్ డిఫెన్స్ అకాడమీ, పుణెలో విద్యాభ్యాసం, శిక్షణ పొందుతారు. అనంతరం ఆర్మీ క్యాడెట్లను డెహ్రాడూన్​లోని ఇండియన్ మిలటరీ అకాడమీ, నేవల్ క్యాడెట్లను ఎలిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీ, ఎయిర్​ఫోర్స్ క్యాడెట్లను హైదరాబాద్​లోని ఇండియన్ ఎయిర్​ఫోర్స్ అకాడమీకి సంబంధిత ట్రేడ్ శిక్షణ కోసం పంపిస్తారు.

 ఉద్యోగం: కోర్సు, శిక్షణ విజయవతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులను ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. ఆర్మీ, నేవీ, ఎయిర్​ఫోర్సుల్లో ప్రారంభ స్థాయి ఆఫీసర్ ఉద్యోగాలైన లెఫ్టినెంట్, సబ్ – లెఫ్టినెంట్, ఫ్లయింగ్ ఆఫీసర్/ గ్రౌండ్ డ్యూటీ ఆఫీసర్ హోదాలో కెరీర్ ప్రారంభం అవుతుంది. 
 
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: డిసెంబర్ 10.

అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ పురుష అభ్యర్థులకు రూ.100. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. 

లాస్ట్ డేట్: 2025, డిసెంబర్ 31. 

పరీక్ష తేదీ: 2026, ఏప్రిల్ 12.

ఎగ్జామ్ సెంటర్స్: తెలంగాణలో హైదరాబాద్, వరంగల్ ఏపీలో విజయవాడ, తిరుపతి, అనంతపురం.

రిజల్ట్స్: 2026, మే ( తేదీ తాత్కాలికం).
 

ఎస్ఎస్​బీ ఇంటర్వ్యూ: 2026, జూన్ నుంచి జులై వరకు. 

పూర్తి వివరాలకు upsc.gov.in వెబ్​సైట్​ను సందర్శించండి. 

సెలెక్షన్ ప్రాసెస్
స్టేజ్–1లో  రాత పరీక్ష ఉంటుంది. ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఇస్తారు. మొత్తం 900 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. పార్ట్–ఏ లో మ్యాథమెటిక్స్, పార్ట్–బిలో జనరల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది. నెగెటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పుడు సమాధానానికి 0.33 మార్కులు కోత విధిస్తారు. 

పేపర్–1: మ్యాథమెటిక్స్ – 300 మార్కులు, 2.30 గంటల సమయం (నేవల్ అకాడమీ 10 + 2 ఎంట్రీ స్కీమ్ మినహా ఐఎంఏ/ ఐఎన్ఏసీ/ ఏఎఫ్ఏ అభ్యర్థులు రాయాల్సి ఉంటుంది.)

పేపర్–2: జనరల్ ఎబిలిటీ టెస్ట్ –600 మార్కులు, 2.30 గంటల సమయం.
పార్ట్ ఏ: ఇంగ్లిష్ – 200 మార్కులు. 
పార్ట్ బి: జనరల్ నాలెడ్జ్ – 400 మార్కులు (ఫిజిక్స్, కెమిస్ట్రీ, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్, జాగ్రఫీ, వర్తమాన వ్యవహారాలు )

స్టేజ్–1లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు స్టేజ్–2కు ఎంపిక చేస్తారు. 
స్టేజ్–2: సర్వీస్ సెలెక్షన్ బోర్డ్ (ఎస్ఎస్​బీ) 
ఇంటర్వ్యూ: 900 మార్కులు. 
స్టేజ్–3: మెడికల్ ఎగ్జామినేషన్.

ఫైనల్ సెలెక్షన్: రాత పరీక్ష, ఇంటర్వ్యూలో సాధించిన మార్కులు, మెడికల్ ఫిట్​నెస్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.  

స్టైఫండ్: ఎన్​డీఏ అకాడమీలో మూడేండ్లపాటు శిక్షణ ఉంటుంది. ఈ కాలంలో ప్రతి నెలా రూ.56,000 స్టైఫండ్ (లెవల్ 10 ప్రారంభ వేతనం) చెల్లిస్తారు.