యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ లోని 451 ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు మే 20 నుంచి జూన్ 9వ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టు/ కోర్స్ పేరు: ఐఎంఏ (163వ డీఈ కోర్స్), ఐఎన్ఏ (ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్/ హైడ్రో), ఎయిర్ ఫోర్స్ అకాడమీ (222ఎఫ్(పీ) కోర్స్), ఓటీఏ చెన్నై (126వ ఎస్ఎస్ సీ మెన్ & ఉమెన్).
మొత్తం ఖాళీలు: 451.
ఖాళీల వివరాలు
- 163వ (డీఈ) కోర్స్– ఇండియన్ మిలిటరీ అకాడమీ (ఐఎంఏ), డెహ్రాడూన్ 100.
- ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్/ హైడ్రో)– ఇండియన్ నావల్ అకాడమీ, ఎజిమల 26.
- 222 ఎఫ్(పీ) కోర్స్ (ప్రీ– ఫైయింగ్ ట్రైనింగ్)– ఎయిర్ ఫోర్స్ అకాడమీ (ఏఎఫ్ఏ), హైదరాబాద్ 32.
- 126వ ఎస్ఎస్ సీ(పురుషులు) (ఎన్ టీ) యూపీఎస్సీ కోర్స్ – ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై 275.
- 126వ ఎస్ఎస్ సీ(మహిళలు) (ఎన్ టీ) యూపీఎస్సీ కోర్స్–- ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై18.
ఎలిజిబిలిటీ
- ఐఎంఏ & ఓటీఏ కోర్సులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
- ఇండియన్ నావల్ అకాడమీ కోర్సులకు ఇంజినీరింగ్ డిగ్రీ లేదా 10+2 స్థాయిలో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ తోపాటు బీఎస్సీలో ఫిజిక్స్ సబ్జెక్టును కోర్/ ఎలెక్టివ్ సబ్జెక్టుగా చదవి ఉండాలి.
- ఎయిర్ ఫోర్స్ అకాడమీ కోర్సులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి 10+2 స్థాయిలో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్‌తోపాటు డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. లేదా బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్ చదివి ఉండాలి.
- అవివాహితులైన స్త్రీ, పురుషఅభ్యర్థులు మాత్రమే అర్హులు.
- ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీకి (ఐఎఫ్ఏ) అప్లై చేసుకున్న అభ్యర్థులు 25 ఏళ్ల లోపు ఉంటే అవివాహితులై ఉండాలి. 25 ఏళ్లు పైబడిన వివాహితులు అర్హులే. కానీ, శిక్షణ సమయంలో వసతి సౌకర్యం ఉండదు.
- అప్లై చేసిన తర్వాత వివాహం చేసుకుంటే సెలెక్షన్స్ లో పరిగణనలోకి తీసుకోరు. శిక్షణ సమయంలో వివాహం చేసుకుంటే అకాడమీ నుంచి అభ్యర్థిని తొలగిస్తారు.
వయోపరిమితి: 19 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి . కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.200. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
లాస్ట్ డేట్: జూన్ 09.
రాత పరీక్ష: సెప్టెంబర్ 13.
ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ (ఐఎంఏ/ ఐఎన్ఏ/ఏఎఫ్ఏ అభ్యర్థులకు): 2027, ఫిబ్రవరి – మార్చి.
ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ (ఓటీఏ అభ్యర్థులకు): 2027, ఏప్రిల్– జూన్
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్)+ ఎస్ఎస్ బీ ఇంటెలిజెన్స్ & పర్సనాలిటీ టెస్ట్ + మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్ సైట్ upsconline.nic.inను సందర్శించండి.
నెలవారీ స్టైఫండ్: శిక్షణా సమయంలో క్యాడెట్లకు ప్రతి నెలా 56,100 స్టైఫండ్ చెల్లిస్తారు.
శిక్షణా కాలం
ఐఎంఏ & ఏఎఫ్ఏ: సుమారు 18 నెలలు.
ఐఎన్ఏ: సుమారు 12 నుంచి15 నెలలు.
ఓటీఏ: 49 వారాలు (సుమారు 11 నెలలు).
సీడీఎస్ పరీక్ష ద్వారా రెండు రకాల నియామకాలు జరుగుతాయి. అవి..
పర్మినెంట్ కమిషన్: ఇది ఐఎంఏ, ఐఎన్ఏ, ఏఎఫ్ఏ ద్వారా ఎంపికైన వారికి లభిస్తుంది. అంటే ఆఫీసర్లు తమ రిటైర్మెంట్ వయసు వచ్చేంతవరకు (కనీసం 20 ఏళ్లకు పైగా) విధుల్లో కొనసాగవచ్చు. వీరికి పెన్షన్ సదుపాయం ఉంటుంది.
షార్ట్ సర్వీస్ కమిషన్: ఇది ఓటీఏ (చెన్నై)కు ఎంపికైన వారికి (పురుషులు, మహిళలు) లభిస్తుంది. ఇందులో ప్రారంభ నియామకం 10 ఏళ్ల కాలానికి ఉంటుంది. ఆ తర్వాత ఆఫీసర్ పనితీరు, ఆసక్తి, ఖాళీలను బట్టి మరో 4 సంవత్సరాలు పొడిగించవచ్చు. 14 ఏళ్ల తర్వాత అర్హతను బట్టి పర్మినెంట్ కమిషన్‌గా మారే అవకాశం లేదా గౌరవప్రదంగా రిటైర్ అయ్యే అవకాశం ఉంటుంది.
– వెలుగు, ఎడ్యుకేషన్ డెస్క్
ఎగ్జామ్ ప్యాటర్న్
ఐఎంఏ/ ఐఎన్ఏ/ ఎయిర్ ఫోర్స్ అకాడమీ
రాత పరీక్ష పూర్తిగా ఆఫ్‌లైన్ పద్ధతిలో, మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఉంటుంది. ఐఎంఏ/ ఐఎన్ఏ/ ఎయిర్ ఫోర్స్ అకాడమీ అభ్యర్థులకు మొత్తం 3 పేపర్లు ఉంటాయి. పేపర్–1 ఇంగ్లిష్ 100 ప్రశ్నలు 100 మార్కులకు, పేపర్–2 జనరల్ నాలెడ్జ్ 100 ప్రశ్నలు 100 మార్కులకు, పేపర్–3 ఎలిమిఎటరీ మ్యాథమెటిక్స్ 100 ప్రశ్నలు 100 మార్కులకు మొత్తం 300 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. ఈ పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పుడు సమాధానానికి 1/3వ వంతు మార్కు (0.33 మార్కులు) కోత విధిస్తారు.
ఎస్ఎస్బీ / ఇంటర్వ్యూ 300 మార్కులకు మొత్తం 600 మార్కులకు ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (ఓటీఏ)
ఓటీఏ అభ్యర్థులకు గణితం పేపర్ ఉండదు. వీరు కేవలం రెండు పేపర్లు మాత్రమే రాయాల్సి ఉంటుంది. పరీక్ష ఆఫ్‌లైన్ పద్ధతిలో జరుగుతుంది. పేపర్–-1లో ఇంగ్లిష్ 120 ప్రశ్నలు 120 మార్కులకు, పేపర్–-2 జనరల్ నాలెడ్జ్ 120 ప్రశ్నలు 120 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. ఈ పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పుడు సమాధానానికి 1/3వ వంతు మార్కు (0.33 మార్కులు) కోత విధిస్తారు.
ఎస్ఎస్బీ / ఇంటర్వ్యూ 200 మార్కులకు మొత్తం 440 మార్కులకు ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
ఐఎంఏ: ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఇండియన్ మిలిటరీ అకాడమీ (ఐఎంఏ) ఉంది. ఇది భారతదేశంలోనే అత్యంత పురాతనమైన, ప్రసిద్ధి చెందిన సైనిక శిక్షణా కేంద్రం. ఇక్కడ కేవలం పురుషులకు (క్యాడెట్లకు) మాత్రమే ఆర్మీ ఆఫీసర్లుగా శిక్షణ ఇస్తారు.
ఓటీఏ: తమిళనాడు రాజధాని చెన్నైలో ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (ఓటీఏ) ఉంది. ఇక్కడ షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ) ద్వారా ఎంపికైన స్త్రీ, పురుష క్యాడెట్లు ఇద్దరికీ ఇక్కడే ఉమ్మడిగా శిక్షణ ఇస్తారు.
ఐఎన్ఏ: కేరళలోని ఎళిమలో ఇండియన్ నావల్ అకాడమీ (ఐఎన్ఏ) ఉంది. ఇది ఆసియాలోనే అతిపెద్ద నావల్ అకాడమీ. నేవీ ఆఫీసర్లుగా ఎంపికైన వారికి ఇక్కడ కఠినమైన నౌకాదళ శిక్షణ ఇస్తారు.
ఏఎఫ్ఏ: తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ శివారులోని దుండిగల్‌లో ఎయిర్ ఫోర్స్ అకాడమీ (ఏఎఫ్ఏ) ఉంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్లు, గ్రౌండ్ డ్యూటీ, టెక్నికల్ ఆఫీసర్లందరికీ ఇక్కడే శిక్షణ ఇస్తారు.
