సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ నోటిఫికేషన్ రిలీజ్

సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ నోటిఫికేషన్ రిలీజ్

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రెండు ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేసింది. సివిల్ సర్వీసెస్ ప్రిలిమనరీ ఎగ్జామినేషన్- 2023, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్-2023 నోటిఫికేషన్ జారీ చేసింది. పూర్తి వివరాలను యూపీఎస్సీ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. ప్రిలిమినరీ పరీక్షకు ఫిబ్రవరి 21వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలని, మే 28న పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ ను యూపీఎస్సీ వెబ్ సైట్  www.upsc.gov.in లో చూడొచ్చు.

ఈ ఉద్యోగ నోటిఫికేషన్ ద్వారా యూపీఎస్సీ 1105 పోస్టులు భర్తీ చేయనుంది. వాటిలో 37 దివ్యాంగులకు కేటాయించారు. మరో 15 పోస్టులను సెరిబ్రల్ పాల్సీ, లెప్రసీ, యాసిడ్ అటాక్ విక్టిమ్స్, మస్కులర్ డిస్ట్రోఫీ కలిగిన వారితో భర్తీ చేయనున్నారు. 

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్తో పాటు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఇవాళ్టి నుంచి 21వ తేదీ వరకు అప్లికేషన్లు సబ్మిట్ చేసేందుకు గడువు ఇచ్చింది. యానిమల్ హస్బెండరీ అండ్ వెటర్నరీ సైన్స్, బోటనీ, కెమిస్ట్రీ, జియాలజీ, మ్యాథ్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, జూవాలజీల్లో ఒక సబ్జెక్ట్ లేదా అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, ఇంజనీరింగ్ బ్యాచిలర్స్ డిగ్రీ కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది. ఐఎఫ్ఎస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ కూడా మే 28న నిర్వహించనున్నారు.