రామగుండం ఫ్యాక్టరీలో ఇవాళ్లి(అక్టోబర్ 1) నుంచి యూరియా ఉత్పత్తి

రామగుండం ఫ్యాక్టరీలో  ఇవాళ్లి(అక్టోబర్ 1) నుంచి యూరియా ఉత్పత్తి
  • హెచ్​టీఆర్​ మెషీన్​లో లీకేజీతో 48 రోజులు షట్​ డౌన్ 
  • రిపేర్లు పూర్తి చేసిన డెన్మార్క్​ కంపెనీ, ఎల్అండ్​టీ సంస్థ

గోదావరిఖని, వెలుగు: రామగుండం ఆర్ఎఫ్​సీఎల్​ ప్లాంట్​లో బుధవారం నుంచి యూరియా ఉత్పత్తి మొదలు కానుంది. ఆగస్టు 14న హెచ్​టీఆర్​ మెషీన్​లో లీకేజీ కారణంగా షట్​డౌన్​ కాగా, 48 రోజుల తరువాత మళ్లీ ఉత్పత్తి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్లాంట్​లో యూరియా ఉత్పత్తి ప్రక్రియలో భాగంగా సింథసిస్​ గ్యాస్​ ప్రొడ్యూస్​ చేసేందుకు ఏర్పాటు చేసిన హీట్​ ట్రాన్స్​ఫార్మింగ్​ రీఫార్మర్(హెచ్​టీఆర్)లో ట్యూబ్​ లీకేజీ ఏర్పడడంతో ప్లాంట్​ బంద్​ అయింది.

 ఈ మెషీన్​ను ఏర్పాటు చేసిన డెన్మార్క్​కు చెందిన హల్దర్​ టాప్స్​ కంపెనీ, ఎల్అండ్​టీ సంస్థ సహకారంతో రిపేర్లు చేపట్టింది. హెచ్​టీఆర్​ మెషీన్​లో డూమ్​ సెట్​ కాకపోవడంతో దానిని హైదరాబాద్​కు పంపించి సరి చేయించారు. దీనిని రెండు రోజుల కింద బిగించారు. మంగళవారం ప్లాంట్​ లైటప్  చేయగా, బుధవారం మధ్యాహ్నం నుంచి యూరియా ఉత్పత్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. ప్లాంట్​ రన్​ అయి ఉత్పత్తి జరిగేంత వరకు డెన్మార్క్​ కంపెనీ, ఎల్అండ్​టీ ఉద్యోగులు ఆర్ఎఫ్​సీఎల్​ ప్లాంట్​లోనే ఉండనున్నారు. ఈ ప్లాంట్​లో రోజుకు 3,850 టన్నుల యూరియా ఉత్పత్తి అవుతుండగా, షట్​డౌన్​ కారణంగా 1.85 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి చేయడానికి అవకాశం లేకుండా పోయింది. ఈ ప్రభావం తెలంగాణ రైతాంగంపై తీవ్రంగా పడింది.