
- కిడ్నీ మార్పిడికి రూ. 15 లక్షలు ఖర్చవుతుందన్న డాక్టర్లు
- దాతలు స్పందించి ఆదుకోవాలని వేడుకుంటున్న కుటుంబసభ్యులు
కోనరావుపేట, వెలుగు: నిరుపేద కుటుంబానికి చెందిన మహిళ రెండు కిడ్నీలు పాడైపోవడంతో చికిత్స చేయించుకోనేందుకు చేతిలో చిల్లిగవ్వ లేక దిక్కుతోచని స్థితిలో సాయం కోసం ఎదురుచూస్తోంది. ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఆర్థికంగా ఆదుకోవాలని వేడుకుంటోంది. వివరాల్లోకి వెళ్తే..రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లికి చెందిన ఊరడి పద్మ (38) కొన్నేండ్లుగా అనారోగ్యంతో బాధపడుతోంది. వేములవాడ, కరీంనగర్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్నా ఆరోగ్యం కుదుటపడలేదు. ఇటీవల ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా డాక్టర్లు టెస్ట్ లు చేసి రెండు కిడ్నీలు పాడయ్యాయని నిర్ధారించారు.
వెంటనే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని గాంధీ దవాఖానకు కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. డాక్టర్లు టెస్టులు చేసి కిడ్నీ మార్పిడి చేయాలని లేదంటే ప్రాణానికే ప్రమాదమని చెప్పారు. అక్కడినుంచి ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లగా రూ.15లక్షలు ఖర్చవుతుందని తేల్చిచెప్పారు. డబ్బులు లేక ట్రీట్ మెంట్ చేయించుకోలేని దీనస్థితిలో బాధితురాలు ఉండగా.. దాతలు ఎవరైనా స్పందించి ఆర్థికసాయం అందించి పద్మ ప్రాణాలను కాపాడాలని భర్త గంగరాజు, పిల్లలు పూజిత, రేఖ, జశ్వంత్ వేడుకుంటున్నారు. దాతలెవరైనా సాయం చేయాలనుకుంటే.. ఊరడి పద్మ, బ్యాంక్ ఆఫ్ బరోడా అకౌంట్ నంబర్ : 75660100000538( IFSC: BARB0VJVEMU) వేములవాడ బ్రాంచ్ ద్వారా కానీ.. లేదంటే.. ఫోన్, గూగుల్ పే ఫోన్ నెంబర్: 9032496414 లోనైనా సాయం చేయాలని బాధితురాలు కోరుతోంది.