కాల్పులకు తెగబడ్డ 19ఏళ్ల యువకుడు

కాల్పులకు తెగబడ్డ 19ఏళ్ల యువకుడు

అమెరికా టేనస్సీలోని మెంఫిస్‌లో 19 ఏళ్ల యువకుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఈ నేపథ్యంలో ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ కాల్పులకు పాల్పడిన యువకుడు ఎజెకిల్ కెల్లీగా పోలీసులు గుర్తించారు. మెంఫిస్ నగరం చుట్టూ తిరుగుతూ కొందరిపై కాల్పులు జరిపాడు. అంతటితో ఆగకుండా ఫేస్‌బుక్‌లోనూ ఈ ఘాతుకాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశాడు. ఈ తరహాల్లో కాల్పులు జరపడం ఆ యువకుడికి కొత్తేం కాదని మెంఫిస్ పోలీసులు తెలిపారు. 

ఇక ఈ ఫేస్‌బుక్ లైవ్ స్ట్రీమ్‌ని గమనించినట్టయితే...  ఈ యువకుడు ఓ దుకాణంలోకి ప్రవేశించి కొందరిపై కాల్పులు జరుపుతున్నట్లు చూడవచ్చు. ఈ క్రమంలోనే షూటర్ తన వాహనాన్నిటయోటా ఎస్‌యూవీని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఎస్‌యూవీ డ్రైవర్‌కు గాయాలయ్యాయి. అనంతరం పోలీసులు ఈ యువకుడి ఫోటోను విడుదల చేశారు. ఈ సందర్భంగా పరిస్థితి అదుపులోకి వచ్చేవరకు మెంఫిస్ నివాసితులు తమ ఇంట్లోనే ఉండాలని పోలీసులు సూచించారు.