హెచ్​1బీ వీసా రెన్యువల్​కు కొత్త విధానం

హెచ్​1బీ వీసా రెన్యువల్​కు కొత్త విధానం

వాషింగ్టన్‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-1బీ వీసా రెన్యువల్ ప్రాసెస్​ను మరింత సులభతరం చేయడానికి అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని కేటగిరీల హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-1బీ వీసాలను దేశీయంగానే రెన్యువల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకునేలా ఓ పైలట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రోగ్రామ్​ను డిసెంబరులో ప్రారంభించనుంది. 3 నెలల పాటు ఈ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందుబాటులో ఉంటుందని వీసా సేవల డిప్యూటీ అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ జూలీ స్టఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెల్లడించారు. 

20 వేల మందికి మొదలు ఈ పైలట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కింద వీసా రెన్యువల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయనున్నారు. ‘‘భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అమెరికా వీసాలకు డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్కువ. భారతీయ ప్రయాణికులకు వీలైనంత త్వరగా వీసా అపాయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఇచ్చేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. అందులో ఒకటి దేశీయ వీసా రెన్యువల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. అమెరికాలో ఉంటున్న హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-1బీ వీసాదారులు.. వారి స్వదేశాలకు వెళ్లకుండానే వీసాలను రెన్యువల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకోవచ్చు.  

డిసెంబరు నుంచి మూడు నెలల పాటు పైలట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కింద తొలుత 20 వేల మందికి వీసాలను ఇక్కడే పునరుద్ధరిస్తాం. ఇందులో మెజార్టీ భాగం భారతీయులే ఉంటారు. క్రమక్రమంగా ఈ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విస్తరిస్తాం’’ అని జూలీ తెలిపారు.