డాక్టర్ రెడ్డీస్ ప్లాంటుకు అబ్జర్వేషన్స్‌‌.. ఐదు జారీ చేసిన ఎఫ్‌‌ డీఏ

డాక్టర్ రెడ్డీస్ ప్లాంటుకు అబ్జర్వేషన్స్‌‌..  ఐదు జారీ చేసిన ఎఫ్‌‌ డీఏ

హైదరాబాద్: డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని బాచుపల్లి యూనిట్​ను తనిఖీ చేశాక యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ ఎఫ్​డీఏ) ఐదు అబ్జర్వేషన్లతో ఫారం– 483ను జారీ చేసింది. ఈ రెగ్యులేటర్ సెప్టెంబర్ 4 నుంచి సెప్టెంబర్ 12 వరకు ఆ సైట్​లో ప్రీ-అప్రూవల్ ఇన్‌‌‌‌‌‌‌‌స్పెక్షన్‌‌‌‌‌‌‌‌ను పూర్తి చేసింది. నిర్ణీత సమయం లోపల అబ్జర్వేషన్స్‌‌‌‌‌‌‌‌ను పరిష్కరిస్తామని కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలిపింది.  

అక్టోబర్ 2023లోనూ అదే యూనిట్​తనిఖీ జరిగింది. ఈ వారం ప్రారంభంలో, హైదరాబాద్  ఈ సంస్థ జాన్సన్ జాన్సన్ అనుబంధ సంస్థ జాన్సెన్ ఫార్మాస్యూటికా ఎన్‌‌‌‌‌‌‌‌వీ నుంచి స్టుజెరాన్ పోర్ట్‌‌‌‌‌‌‌‌ఫోలియోను 50.5 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. డాక్టర్ రెడ్డీస్ 2026 ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్​లో రూ.8,542 కోట్ల ఆదాయాన్ని, రూ.1,417.8 కోట్ల లాభాన్ని సాధించింది.