సెన్సెక్స్‌ 420 పాయింట్లు డౌన్‌

సెన్సెక్స్‌ 420 పాయింట్లు డౌన్‌

న్యూఢిల్లీ: యూఎస్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ డేటా వెలువడే ముందు లోకల్ మార్కెట్‌‌‌‌లు నష్టపోయాయి. సెన్సెక్స్  గురువారం 420 పాయింట్లు (0.69 శాతం) తగ్గి 60,614 వద్ద క్లోజయ్యింది. నిఫ్టీ 129 పాయింట్లు నష్టపోయి 18,028 వద్ద ముగిసింది. గ్లోబల్‌‌‌‌ మార్కెట్‌‌‌‌లు నష్టాల్లో  కదలడంతో లోకల్ మార్కెట్‌‌‌‌లు కూడా పడ్డాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌‌‌‌ ఎనలిస్ట్ వినోద్ నాయర్ అన్నారు. ఆటో, పీఎస్‌‌‌‌యూ బ్యాంక్స్‌‌‌‌ షేర్లలో  ప్రాఫిట్ బుకింగ్ జరిగిందని, మిడ్‌‌‌‌క్యాప్, స్మాల్‌‌‌‌క్యాప్‌‌‌‌ షేర్లు ఇదే ట్రెండ్‌‌‌‌ను ఫాలో అయ్యాయని పేర్కొన్నారు. అన్ని సెక్టార్ల ఇండెక్స్‌‌‌‌లు గురువారం నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ ఆటో, పీఎస్‌‌‌‌యూ బ్యాంక్ ఇండెక్స్‌‌‌‌లు 2 శాతం వరకు పతనమయ్యాయి. ఫార్మా, మెటల్‌‌‌‌, ఎనర్జీ, ఇన్‌‌‌‌ఫ్రా, ఎఫ్‌‌‌‌ఎంసీజీ ఇండెక్స్‌‌‌‌లు 0.5 శాతం వరకు నష్టపోయాయి. బీఎస్‌‌‌‌ఈ మిడ్‌‌‌‌క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌‌‌‌లు ఒక శాతం చొప్పున పడ్డాయి. రెండు మూడుసార్లు 18,200 లెవెల్‌‌‌‌ను క్రాస్‌ చేయడానికి ప్రయత్నించినా, ఈ లెవెల్‌‌‌‌పైన నిఫ్టీ సస్టయిన్ కాలేకపోయిందని బీఎన్‌‌‌‌పీ పారిబా ఎనలిస్ట్ గౌరవ్‌‌‌‌ రత్నపార్ఖి అన్నారు. తాజాగా డైలీ చార్ట్‌‌‌‌లో ఏర్పడిన హయ్యర్ హై  ఫార్మేషన్‌‌‌‌, షార్ట్‌‌‌‌ టెర్మ్‌‌‌‌ ట్రెండ్ ఇండికేటర్స్‌‌‌‌తో లింక్ కాలేదని, డైవర్జెన్స్‌‌‌‌ రావడంతో షార్ట్‌‌‌‌టర్మ్‌‌‌‌లో ఈ ఇండెక్స్‌‌‌‌ కన్సాలిడేట్ అవ్వొచ్చని చెప్పారు. గురువారం సెషన్‌‌‌‌లో నిఫ్టీ 18,000–17,960 వరకు పడిందని, షార్ట్‌‌‌‌ టర్మ్‌‌‌‌లో 17,800 వరకు పడొచ్చని అంచనావేస్తున్నామని  చెప్పారు. పైన 18,100–18,120 రెసిస్టెంట్‌‌‌‌గా పనిచేస్తుందని అన్నారు.

కూల్ అయిన యూఎస్ ఇన్‌‌‌‌‌‌ప్లేషన్‌‌‌‌

యూఎస్ ఇన్‌‌‌‌ఫ్లేషన్ అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో ఎనలిస్టులు అంచనావేసిన దాని కంటే  ఎక్కువ తగ్గింది. కిందటేడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే  ఈ ఏడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో యూఎస్ ఇన్‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌ 7.7 శాతానికి పెరిగింది. ఈ ఏడాది జనవరి నుంచి చూస్తే ఇన్‌‌‌‌ఫ్లేషన్ ఏడాది ప్రాతిపదికన ఈసారే తక్కువ పెరిగింది. అదే సెప్టెంబర్ నెలతో పోలిస్తే అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో 0.4 శాతం పెరిగింది. ఫుడ్‌‌‌‌, ఎనర్జీ విభాగాలను తీసేస్తే మిగిలిన విభాగాలను కొలిచే ‘కోర్‌‌‌‌‌‌‌‌’ ఇన్‌‌‌‌ఫ్లేషన్ ఏడాది ప్రాతిపదికన 6.3 శాతానికి చేరుకుంది. అదే సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే 0.3 శాతం పెరిగింది. ఎనలిస్టుల అంచనాల కంటే ఇన్‌‌‌‌ఫ్లేషన్ తక్కువగా నమోదు కావడంతో యూఎస్ మార్కెట్‌‌‌‌లు గురువారం 2 శాతం లాభంతో ఓపెన్ అయ్యాయి. ఎస్‌‌‌‌జీఎక్స్ నిఫ్టీ కూడా భారీగా పెరిగింది.