ప్రపంచ దేశాలకు గుడ్ న్యూస్.. ఇరాన్ , అమెరికా యుద్దం ముగిసింది.. నాలుగు నెలల సుదీర్థ మిస్సైల్ పోరాటానికి తెరపడింది. రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది.ఇకపై ఎటువంటి దాడులు చేసుకోవద్దని ఒప్పందంపై సంతకాలు చేశాయి. అమెరికా, ఇరాన్ మధ్య ఆదివారం జరిగిన చర్చలు సఫలం అయినట్లు మధ్య వర్తి అయిన పాకిస్తాన్ ప్రకటించింది. ఇది జరిగిన వెంటనే ట్రంప్ కూడా సోషల్ మీడియా వేదికగా యుద్దం ముగిసినట్టు స్వయంగా ప్రకటించారు.
ఇరాన్ తో ఒప్పందం కుదిరింది. అందరకి శుభాకాంక్షలు.. హార్ముజ్ జలసంధిని సుంకం లేకుండా తెరవడానికి అంగీకరిస్తున్నాం.. ప్రపంచ నౌకలారా ఇక మీ ఇంజన్లు స్టార్ట్ చేసుకోండి.. చమురు రవాణా చేసుకోండి అంటూ (ట్రంప్ తన 80 జన్మదినం సందర్భంగా) సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
