రికార్డ్ స్థాయిలో అమెరికా వీసాలు: భారత్కే అధికం..

రికార్డ్ స్థాయిలో అమెరికా వీసాలు: భారత్కే అధికం..

భారతీయ విద్యార్థులకు ఈ ఏడాది అమెరికా రికార్డు స్థాయిలో వీసాలను జారీ చేసింది. 2022 అక్టోబర్ నుంచి 2023 సెప్టెంబర్ వరకు గతేడాది భారత్ లోని అమెరికా కార్యాలయం, కాన్సెలేట్లు లక్షా 40వేల మంది భారతీయ విద్యార్థులకు వీసాలను జారీ చేసి ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. ఈ మేరకు యూఎస్ స్టేట్స్ డిపార్ట్ మెంట్ మంగళవారం (నవంబర్ 25) ఓ ప్రటకన విడుదల చేసింది. 

2015 తర్వాత ఇంత పెద్ద మొత్తంలో వీసాలు జారీ చేయడం ఇదే తొలిసారి. ప్రపంచ వ్యాప్తంగా అమెరికా విడుదల చేసిన వీసాల్లో 10 శాతానికి పైగా భారతీయులు ఉన్నారు. ఇందులో విద్యార్థులు 20 శాతం కాగా..హెచ్ ఎల్ (ఉపాధి) వీసా65 శాతం ఉన్నారు. 

అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా 10 మిలియన్లకు పైగా నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలను రికార్డ్ స్థాయిలో జారి చేసిందని యూఎస్ స్టే్ట్స్ డిపార్ట్ మెంట్ తెలిపింది. బిజినెస్, టూరిజం లక్ష్యంగా ఈ ఏడాది 8 మిలియన్ల విజిటింగ్ వీసాలను అమెరికా జారీ చేసింది. కేవలం విద్యార్థులకు 6లక్షల వీసాలను జారీ చేసింది. 2017 తర్వాత ఇదే అత్యధికం.

అయితే అమెరికా వీసాలను అత్యధికంగా జారీ చేయడానికి కారణాలు లేకపోలేదు. అమెరికా జాతీయ భద్రతా ప్రమాణాలకు కట్టుబడి ఉండే ప్రయాణికులకు దౌత్య కార్యాయాలు లేదా కాన్సులేట్ లను సంప్రదించకుండా వారి వీసాలను పునరుద్దరించడమే ఇందుకు కారణం .