ట్రంప్​ మాట్లాడుతుండగానే.. లైవ్​ ఆపేసిన మీడియా

ట్రంప్​ మాట్లాడుతుండగానే.. లైవ్​ ఆపేసిన మీడియా

న్యూయార్క్​: అమెరికా ప్రెసిడెంట్​ మాట్లాడుతున్నారంటేనే.. న్యూస్​ చానెళ్లన్నీ క్యూ కట్టేస్తాయి. కానీ, ట్రంప్​ విషయంలో మాత్రం గురువారం సీన్​ రివర్స్​ అయింది. ప్రెసిడెంట్​ అని కూడా చూడలేదు. వైట్​హౌస్​లో లైవ్​ కట్​చేసి ట్రంప్​కు షాకిచ్చాయి. కవరేజ్​ను వెంటనే కట్​ చేసేశాయి. మరికొన్ని చానెళ్లు ప్రసా రంచేసినా ఆయన ఆరోపణలకు ఆధారాల్లేవని బ్రేకిం గ్​లు వేశాయి. మొత్తంగా ఇంటర్నేషనల్​ మీడియాలోని చానెళ్లు ట్రంప్​ చెబుతున్నవన్నీ అబద్ధాలేనని నిరసన వ్యక్తంచేస్తున్నాయి. ‘‘గెలుపును నా నుంచి దోచేస్తున్నరు. కౌంటింగ్​ ఆపేయాలి’’ అంటూ ట్రంప్​ కామెంట్​ చేశారు. పదే పదే ఇలాంటి ఆరోపణలే చేస్తుండడంతో చానెళ్లు ఆయన బ్రీఫింగ్​ను ఆపేశాయి.

ప్రెసిడెంట్​ను సరిదిద్దాల్సిందే..

‘‘ప్రెసిడెంట్​ అన్నీ అబద్ధాలే చెబుతున్నారు. ఓటింగ్​లో మోసం జరిగిందనీ ఆరోపిస్తున్నారు. ఆయన చెబుతున్న మాటలకు ఆధారాలేవీ లేవు. కాబట్టి ఆయన లైవ్​ను ఇక్కడితో ఆపేస్తున్నాం’’ అంటూ ఎన్​బీసీ న్యూస్​ యాంకర్​ లెస్టర్​ హోల్ట్​ కామెంట్​ చేశారు. ఎలక్షన్​ డే తర్వాత వచ్చే ఓట్లన్నీ ఇల్లీగలేనంటూ ట్రంప్​ అంటున్నారని, కానీ, ఆయన మాటల్లో నిజం లేదని సీబీఎస్​ యాంకర్​ నోరా ఓ డోనెల్​ అన్నారు. కవరేజీని ఏబీసీ సడన్​గా కట్​చేసిన వెంటనే.. ఆ సంస్థ వైట్​హౌస్​ ప్రతినిధి జొనాథన్​ కార్ల్​ కూడా ట్రంప్​ అంటున్న ఇల్లీగల్​ ఓట్లకు ఆధారాలేవీ లేవన్నారు. నిజానికి ట్రంప్​ కవరేజ్ కట్​ చేసిన ఫస్ట్​ చానెల్ ఎంఎస్​ఎన్​బీసీ. ఆయన లైవ్​లోకి వచ్చిన జస్ట్​ 19 క్షణాల్లోనే కనెక్షన్​ను కట్​ చేసింది. ‘ప్రెసిడెంట్​ అయినా కూడా లైవ్​ కవరేజ్​ కట్​ చేసేస్తున్నం’ అంటూ యాంకర్​ చెప్పారు.

ఎఫ్బీలో సపోర్టర్స్ గ్రూప్ బ్యాన్

ట్రంప్ కు మద్దతుగా ఆందోళనలకు వేదికగా మారిన ‘స్టాప్ ద స్టీల్’ గ్రూప్ ను ఫేస్ బుక్ గురువారం బ్యాన్ చేసింది. రిపబ్లికన్ల నుంచి డెమొక్రాట్లు అధికారం లాక్కుంటున్నారని, ఓటింగ్ లో ఫ్రాడ్ జరిగిందని, గన్స్ క్లీన్ చేయాల్సిన టైమొచ్చిందని, వీధుల్లోకి వచ్చి పోరాడాలని ఈ గ్రూప్​లోని మెంబర్లు పోస్టులు పెట్టారు. ఇది హింసను ప్రేరేపించేలా ఉందని, అందుకే బ్యాన్ చేసినట్టు ఫేస్ బుక్ తెలిపింది. ‘స్టాప్ ద స్టీల్’ గ్రూప్ లో మూడున్నర లక్షల మంది మెంబర్స్ ఉన్నట్టు  పేర్కొంది.