కాలిఫోర్నియాలో కుప్పకూలిన అమెరికా నేవీ ఫైటర్ జెట్

కాలిఫోర్నియాలో కుప్పకూలిన అమెరికా నేవీ ఫైటర్ జెట్

వాషింగ్టన్: యూఎస్ నేవీకి చెందిన ఎఫ్-35 ఫైటర్ జెట్ కుప్పకూలింది. అమెరికా కాలమానం ప్రకారం.. బుధవారం (జూలై 30) సాయంత్రం 6.30 గంటలకు కాలిఫోర్నియాలోని నావల్ ఎయిర్ స్టేషన్ లెమూర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. పైలట్ ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డట్లు అధికారులు వెల్లడించారు.

రెస్య్కూ టీమ్ హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. జైట్ కూలిపోవడానికి కారణమేంటనేది తెలియరాలేదని.. ఈ ఘటనపై నిపుణుల బృందం ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిందని చెప్పారు. ఫైటర్ జైట్ కూలిపోయిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది. 

ఈ వీడియోలో విమానం క్రాష్ కాగానే జెట్ శిథిలాల నుంచి భారీగా మంటలు ఎగసిపడుతున్నట్లు కనిపించగా.. ఆ ప్రాంతంలో నల్లటి పొగ దట్టంగా అలుముకుంది. కాగా, ఈ ఎఫ్-35 స్టెల్త్ ఫైటర్ జెట్‎ను రఫ్ రైడర్స్‎గా పిలుస్తారు. ముఖ్యంగా ఈ జెట్‎లను పైలట్లు, ఎయిర్‌క్రూలకు శిక్షణ ఇచ్చేందుకు ఉపయోగిస్తుంటారు. తాజాగా ప్రమాదానికి గురైన ఈ జెట్ స్ట్రైక్ ఫైటర్ స్క్వాడ్రన్‎కు కేటాయించబడినట్లు అధికారులు వెల్లడించారు.