అల్కరాజ్‌‌‌‌ అదరహో..క్వార్టర్స్​లోకి టాప్​సీడ్​

అల్కరాజ్‌‌‌‌ అదరహో..క్వార్టర్స్​లోకి టాప్​సీడ్​

న్యూయార్క్‌‌‌‌: యూఎస్‌‌‌‌ ఓపెన్‌‌‌‌ గ్రాండ్‌‌‌‌స్లామ్‌‌‌‌లో వరల్డ్‌‌‌‌ నంబర్‌‌‌‌వన్‌‌‌‌, డిఫెండింగ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌ కార్లోస్‌‌‌‌ అల్కరాజ్‌‌‌‌తో పాటు టాప్‌‌‌‌ సీడెడ్‌‌‌‌ ప్లేయర్లందరూ సాఫీగా మరో అడుగు ముందుకేశారు. సోమవారం అర్ధరాత్రి జరిగిన మెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌ ప్రిక్వార్టర్స్‌‌‌‌లో టాప్‌‌‌‌ సీడ్‌‌‌‌ అల్కరాజ్‌‌‌‌ (స్పెయిన్‌‌‌‌) 6–3, 6–3, 6–4తో మెటో అర్నాల్డి (ఇటలీ)పై గెలిచి క్వార్టర్‌‌‌‌ఫైనల్లోకి అడుగుపెట్టాడు. 

గంటా 57 నిమిషాల మ్యాచ్‌‌‌‌లో కార్లోస్‌‌‌‌ బలమైన సర్వీస్‌‌‌‌లతో హోరెత్తించాడు. రెండు ఏస్‌‌‌‌లు కొట్టిన అల్కరాజ్‌‌‌‌ 31 విన్నర్లు, 5 బ్రేక్‌‌‌‌ పాయింట్లతో మ్యాచ్‌‌‌‌ను గెలుచుకున్నాడు. ఇతర మ్యాచ్‌‌‌‌ల్లో మెద్వెదెవ్‌‌‌‌ (రష్యా) 2–6, 6–4, 6–1, 6–2తో డి మెన్యూర్‌‌‌‌ (ఆస్ట్రేలియా)పై, రుబ్లెవ్‌‌‌‌ (రష్యా) 6–3, 3–6, 6–3, 6–4తో డ్రాపెర్‌‌‌‌ (అమెరికా)పై, జ్వెరెవ్‌‌‌‌ (జర్మనీ) 6–4, 3–6, 6–2, 4–6, 6–3తో జినెర్‌‌‌‌ (ఇటలీ)పై  గెలిచి ముందుకెళ్లారు. 

విమెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌లో రెండో సీడ్‌‌‌‌ సబలెంక (రష్యా) 6–1, 6–3తో డరియా కసాట్కినా (రష్యా)పై గెలిచి క్వార్టర్స్‌‌‌‌లోకి వెళ్లింది. తాజా విజయంతో ఆమె డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌‌‌‌లో నంబర్‌‌‌‌వన్‌‌‌‌ ర్యాంక్‌‌‌‌ను సొంతం చేసుకోనుంది. ఇతర మ్యాచ్‌‌‌‌ల్లో వొండ్రుసోవా (చెక్‌‌‌‌) 6–7 (3/7), 6–3, 6–2తో స్టెర్న్స్‌‌‌‌ (అమెరికా)పై, జెంగ్‌‌‌‌ (చైనా) 6–2, 6–4తో జబెర్‌‌‌‌ 
(ట్యూనీసియా)పై నెగ్గి క్వార్టర్స్‌‌‌‌లోకి దూసుకెళ్లారు.