శ్రీలంక మృతుల విషయంలో ట్రంప్ పొరపాటు

శ్రీలంక మృతుల విషయంలో ట్రంప్ పొరపాటు

ఈస్టర్ పండుగ వేళ కొలంబో లోని చర్చిల్లో ప్రార్థనలు చేసుకుంటున్న క్రైస్తవులపై ఉగ్రవాదులు బాంబు దాడులకు దిగారు. ఈ ఘటనలో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. శ్రీలంకతో పాటు ప్రపంచం మొత్తం ఈ దాడులను ఖండిస్తోంది. ఈ ఘటనపై స్పందిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తప్పులో కాలేశారు.

“శ్రీలంక చర్చిలు, హోటళ్లలో జరిగిన మారణహోమంలో 138 మిలియన్ల మంది చనిపోవడం, 600 పైచిలుకు మంది గాయపడటం పట్ల అమెరికా హృదయ విదారక సంతాపం తెలియజేస్తోంది. ఈ క్లిష్ట తరుణంలో లంకకు సహాయ సహకారాలు అందించడానికి మేము సిద్దంగా ఉన్నాం” అంటూ ట్వీట్ చేశారు. తన ట్వీట్ లో మృతుల సంఖ్యను 138 మిలియన్లుగా చెప్పారు. అందులో తప్పు ఉండడంతో ఆ ట్వీట్ తొలగించారు. వెంటనే మరో ట్వీట్ పెట్టారు. అందులో 138 మంది చనిపోయారంటూ తన పొరపాటును సరిదిద్దుకున్నారు.