అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించిన చిన్న విమానం

అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించిన చిన్న విమానం

ఓ చిన్న విమానం అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించింది. దీని కారణంగా.. అమెరికా అధ్యక్షులు బైడెన్ దంపతులు సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లాల్సి వచ్చింది. భద్రతా వైఫల్యం మరోసారి తెరపైకి వచ్చింది. చిన్న ప్రైవేటు విమానం పొరపాటున అధ్యక్షుడి అధికారిక నివాసంపై ప్రవేశించడంతో అందరూ కలవరపాటుకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బృందం బైడెన్ తో పాటు ప్రథమ మహిళను కొద్దిసేపు మరో ప్రాంతానికి తరలించారు. ఎలాంటి ముప్పు లేదని వైట్ హౌస్ అధికారులు ప్రకటించారు. బైడెన్ ఆయన సతీమణి జిల్ బైడెన్ తో కలిసి డేలావేర్ లోని రిహోబత్ బీచ్ లోని అధ్యక్ష విడిదికి చేరుకున్నారు. రాజధాని వాషింగ్టన్ కు ఇది 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శనివారం ఓ చిన్న విమానం పొరపాటున నిషేధిత గగనతలంలోకి ప్రవేశించింది.

విమానాన్ని గ్రహించిన భద్రతా అధికారులు అలర్ట్ అయ్యారు. విమానాన్ని తరిమారు. భారీ బందోబస్తు మధ్య మరో సురక్షిత ప్రాంతానికి తరలించారు. పొరపాటున ప్రవేశించిందని తెలుసుకున్న అనంతరం తిరిగి అధ్యక్షులు నివాసానికి చేరుకున్నారు. వాషింగ్టన్ బయటి ప్రాంతాలకు అధ్యక్షులు బయలుదేరినప్పుడు ఆయన విడిది చేసే ప్రదేశాల్లో దాదాపు 10 మైళ్ల వరకు నో ఫ్లై జోన్ గా ప్రకటిస్తారు. 30 మైళ్ల వరకు ఉన్న ప్రాంతాన్ని నిషేధిత గగనతలంగా పేర్కొంటారు. కానీ.. ఇది తెలియని ఆ పైలట్ నిషేధిత ప్రాంతంపైకి వచ్చాడు. పైలట్ కు అవగాహన లేకపోవడం వల్లే ఇది జరిగిందని అధికారులు భావిస్తున్నారు. ఆ పైలట్ ను విచారిస్తున్నారు. 

మరిన్ని వార్తల కోసం : -

12 ఏళ్ల బంధానికి గుడ్ బై చెప్పిన షకీరా, గెరార్డ్ పిక్ 


తూర్పు ఉక్రెయిన్​లో చీకట్లు