నీకేమైనా పిచ్చా.. నీ వల్లే చర్చలు విఫలం.. ఫస్ట్ టైమ్ ఇజ్రాయెల్ ప్రధానిపై ట్రంప్ సీరియస్

నీకేమైనా పిచ్చా.. నీ వల్లే చర్చలు విఫలం.. ఫస్ట్ టైమ్ ఇజ్రాయెల్ ప్రధానిపై ట్రంప్ సీరియస్

యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి యూఎస్ ప్రసిడెంట్ ట్రంప్ .. ఇజ్రాయెల్ ప్రధానిపై సీరియస్ అయ్యారు. నీ కేమైనా పిచ్చా.. నీ వల్లే ఇరాన్ తో చర్చలు సఫలం అవ్వడం లేదని మండిపడ్డారు. ఇరు నేతల మధ్య జరిగిన చర్చల్లో నెతన్యాహుపై కోప్పడినట్లు ట్రంప్ తెలిపారు. 

ఒకవైపు ఇరాన్ తో చర్చల కోసం నేను ఇంతలా కష్టపడుతుంటే.. నువ్వేమో ప్రతీసారి దాన్ని సఫలం కాకుండా చేస్తున్నావ్ అన్నట్లుగా ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ తో యుద్ధానికి బ్రేక్ ఇచ్చిన తర్వాత.. సీజ్ ఫైర్ కొనసాగేలా.. హార్మూజ్ జలసంధి గుండా నౌకల ప్రయాణానికి ఆటంకం కలగకుండా ఇరాన్ ను ఒప్పించేందుకు గత కొన్ని రోజులుగా ట్రంప్ కృషి చేస్తున్నారు. 

అయితే లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడితో కథ మళ్లీ మొదటికి వచ్చింది. అమెరికాతో చర్చలు లేవు అని ఇరాన్ వెనక్కు జరిగింది. సీజ్ ఫైర్ (కాల్పుల విరమణ) ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘించిందని.. అందుకే చర్చలనుంచి తప్పుకుంటున్నట్లు ఇరాన్ ప్రకటించింది.

ఇరాన్ చర్చలను సస్పెండ్ చేయడం ట్రంప్ కు బాగా మండిందనే చెప్పాలి. న్యూయార్క్ టైమ్స్ పోస్ట్ పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ.. రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు.. అవును నెతన్యాహుపై సీరియస్ అయ్యానని అంగీకరించారు. 

అవును కోప్పడ్డాను. ఫ*గ్ క్రేజీ అని ఆగ్రహం వ్యక్తం చేశా. అలాగని నాకు నెతన్యాహు పై కోపం ఉందని చెప్పను. కొంతమేరకు చిరాకు వచ్చిందని మాత్రం చెప్పగలను. నీకేమైనా పిచ్చా.. నేనే లేకుంటే నువ్వు ఈపాటికి జైల్లో ఉండేవాడివి. నిన్ను కాపాడుతోంది నేనే. ప్రపంచం అతా నిన్ను ద్వేషిస్తోంది. ఇజ్రాయెల్ ను ప్రతి ఒక్కరు ద్వేషిస్తున్నారు. ఎందుకంటే ఇందుకే.. అంటూ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు యూఎస్ అధికారి ఒకాయన చెప్పారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి రిపోర్టు గురించి చెప్పడానికి ట్రంప్ ముందుకురాలేదు.